రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ దోస్తీ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూటమి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణకు చెందిన ఓ నేత అడ్డం పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలే ఉన్న ఆ నేత కేంద్రంలోని బీజేపీ పెద్దలను టీడీపీకి చేరువ కాకుండా అడ్డం పడుతున్నారని దిల్లీలో వినిపిస్తోంది.
నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం సులభవుతుందని తమ అధిష్ఠానానికి పలుమార్లు స్పస్టం చేశారని.. ఆయన టీడీపీతో పొత్తుకు చాలా సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే… తెలంగాణ బీజేపీ నుంచి కేంద్రంలో పెద్ద పదవుల్లో ఉన్న మరో నేత మాత్రం వైసీపీ మంత్రం జపిస్తున్నారట. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి బీజేపీ అధిష్ఠానం వద్ద వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వారితోనే కలిసి సాగడం మంచిదని చెప్తున్నారట.
టీడీపీ, బీజేపీలు కలిస్తే ఆ కూటమిలో ఏపీలో జనసేన కూడా ఉంటుంది. ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమ ఓటమి ఖాయమని వైసీపీ నేతలూ ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే అంతర్గత సర్వేలన్నీ రానున్న ఎన్నికల్లో విజయం కష్టమని చెబుతున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా వస్తే ఎదుర్కోవడం కష్టమని భావిస్తోంది. దీంతో ఎలాగైనా టీడీపీ, బీజేపీ దోస్తీకి బ్రేక్ వేయాలని ఆ బీజేపీ నేతను కోరుతోందట.
కానీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, మరికొందరు ఆ పార్టీ నేతలు మాత్రం తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి క్యాడర్ ఉండడం… టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు కూడా కొందరు అక్కడ ఇమడలేకపోతుండడంతో.. బీజేపీ, టీడీపీ పొత్తు తెలంగాణలో అలాంటి నేతలను ఆకర్షించడంతో పాటు కార్యకర్తలనూ ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అనేక సీట్లు గెలవడానికి టీడీపీతో పొత్తు ఉపయోగపడుతుందని బండి వర్గీయులు చెబతున్నారు.
రెండు పార్టీలూ కలిస్తే ఏపీలో టీడీపీ సీఎం, తెలంగాణ బీజేపీ సీఎం ఉంటూ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా నడపొచ్చని విశ్లేషిస్తున్నారు. మరి.. బీజేపీ అధిష్ఠానం బండి మాట వింటుందా కేంద్రంలోని పదవిలో ఉన్న నేత మాట వింటుందా చూడాలి.
This post was last modified on December 16, 2022 10:18 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…