నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు.
1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది…
జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాడు రాజధానికి శంకుస్థాపన చేసి మట్టి, నీళ్లు ఇచ్చిన మోదీ చేతులు దులుపుకున్నారని గుర్తు చేస్తున్న రైతు సోదరులు.. తదనంతర పరిణామాలపై కూడా ఆగ్రహం చెందుతున్నారు.
మూడు రాజధానుల సహేతుకం కాదని అమరావతి మాత్రమే రాజధాని అవుతుందని కోర్టు వరుస తీర్పులిచ్చినా… కేంద్రం ఎందుకు జగన్ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మొక్కుబడి ధర్నాలు చేస్తున్నారని, వాళ్లు తలిస్తే జగన్ ను దారికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని రైతుల వాదన.
అందరి దగ్గర ప్రస్తావిస్తాం…
ఢిల్లీలో ఉండే రెండు మూడు రోజుల్లోనే జగన్, మోదీ తీరును అందరి దగ్గర ఎండగట్టాలని అమరావతి రైతులు నిర్ణయానికి వచ్చారు. బృందాలుగా విడిపోయి వేర్వేరు పార్టీల నేతలను కలుసుకోబోతున్నారు. తమకు సింపథీ అవసరం లేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ రైలెక్కామని చెప్పబోతున్నారు.
నిజానికి అమరావతి రైతలపై దేశంలో సానుభూతి ఉన్న మాట వాస్తవం. అందుకే ఢిల్లీలో ప్రతిపక్ష పెద్దల దృష్టికి మరో సారి ఈ అంశాన్ని తీసుకెళ్లి జగన్ పై వత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. వీలైతే కొందరు నేతలను ఏపీకి తీసుకొచ్చి అమరావతి దుస్థితిని చూపించాలనుకుంటున్నారు. మరి అందుకు మార్గం సుగమం అవుతుందో లేదో….
This post was last modified on December 15, 2022 9:13 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…