ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా ఎంత రగడ నడుస్తోందో తెలిసిందే. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఒక్కోటి రూ.337 రూపాయలకే కొన్న కిట్లను ఏపీ సర్కారు రూ.700 చొప్పున పెట్టి కొనడంపై దుమారం రేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ముందు బుకాయించినప్పటికీ.. తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగింది. చివరికి రేటు తగ్గించే ప్రభుత్వానికి అందజేసేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన కంపెనీ అంగీకరించినట్లు చెబుతున్నారు. ఐతే ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు పది నుంచి 30 నిమిషాల లోపే ఫలితాలు వెల్లడిస్తాయని అంటున్నారు. ఐతే వీటి ఫలితాల్లో కచ్చితత్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ కిట్లు తయారైన కొరియాలోనే వీటి నాణ్యత మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడి వైద్యులు ఈ కిట్లను ఉపయోగించవద్దని సూచించారు. అయినా సరే.. ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు ఆ కిట్లను తెప్పించుకున్నాయి. ఐతే ఈ కిట్ల పనితీరును పరిశీలిస్తే కచ్చితమైన ఫలితాలు రావట్లేదని వెల్లడైందని.. ఫలితాల్లో తేడా ఉంటోందని.. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ కిట్ల వినియోగం ఆపాలని.. తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు ఎదురు చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి మీడియా సమవేశంలో తెలిపారు. మరి లక్ష ర్యాపిడ్ కిట్లు వచ్చేశాయ్.. టెస్టింగ్స్ సంఖ్య ఒక్కసారిగే పెంచేద్దాం అనుకున్న ఏపీ సర్కారుకు ఇది ఇబ్బందికర పరిణామమే.
This post was last modified on April 22, 2020 3:45 pm
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…