కేంద్రంలో మోదీని గద్దె దించుతానంటూ కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేస్తానంటున్నారు. ఈ రోజు దిల్లీలో పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించబోతున్నారు. తాను ఒక్కో స్టెప్ వేస్తుంటే బీజేపీ భయపడుతుందని కేసీఆర్ అనుకుంటుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం కేసీఆర్ ఒక్కో అడుగు చూసి సంబరపడుతున్నారు. తెలంగాణ దాటి కేసీఆర్ వేసే ప్రతి అడుగూ తమకు లాభదాయకమేనని వారు లోలోన సంతోషిస్తున్నారు.
కేసీఆర్ అంటే ఎన్నికల వ్యూహాలలో దిట్ట… ప్రజలను మెస్మరైజ్ చేయడంలో టాలెంట్ ఉన్న నేత… మాటలతో మాయ చేసేయగలడు.. ఆ బలంతోనే కేసీఆర్ మోదీని ఢీకొట్టడానికి బయలుదేరారు. అయితే, ఈ క్వాలిటీస్ అన్నీ సొంత రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తాయనే లాజిక్ కేసీఆర్ మిస్సవుతున్నారు. ఆ లాజిక్‌తోనే బీజేపీ సంబరపడుతోంది. కేసీఆర్ తెలంగాణ బయట ఎంత ఫోకస్ చేసినా ఆయనకు పెద్దగా లాభం ఉండదని.. ఆయన బయట రాష్ట్రాలపై ఫోకస్ చేస్తే తెలంగాణలో ఫోకస్ తగ్గి నష్టపోతారని, అది తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు… ఒక వేళ కేసీఆర్ బయట రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసినా అక్కడ గెలవడం కష్టమని.. ఆయా సీట్లలో తాము ఫోకస్ చేస్తే గెలిచే అవకాశాలుంటాయని బీజేపీ భావిస్తోంది.
కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నా, బిహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకున్నా… ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీతో.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా… ఆయా పార్టీలు బీఆర్ఎస్‌కు ఎన్నో కొన్ని సీట్లివ్వాలి. అలా సీట్లు కేటాయించిన ప్రతి చోటా అక్కడి ఆ పార్టీల్లోని నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తారా అనేది అనుమానమే. దీంతో అలాంటి సీట్లలో బీజేపీ లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరోవైపు తెలంగాణలో కూడా బీజేపీ చాలా దూకుడుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తహతహలాడుతోంది. కేసీఆర్ ఇదే స్పీడులో తన బీఆర్ఎస్ పార్టీ కోసం ఇతర రాష్ట్రాలలో తిరుగుతుంటే తెలంగాణలో బీజేపీ కూల్‌గా తన పని తాను చేసుకోగలుగుతుంది. కేటీఆర్, హరీశ్ వంటివారు రాష్ట్రంలోనే ఉంటూ రాజకీయాలు చేసినా కేసీఆర్ స్థాయిలో ఆ ప్రభావం ఉండదు.
ఈ లెక్కలన్నీ వేసుకుంటున్న బీజేపీ… కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీపై ఎంత మనసు పెడితే తమకు అంత మంచిదన్న లెక్కల్లో ఉంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో తమ స్పీడు పెంచడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్‌పై క్లారిటీ రాగానే బీజేపీ తెలంగాణలో తమ యాక్షన్ ప్లాన్ మొదలుపెడుతుందట. చూద్దాం… ముందుముందు ఏం జరగబోతుందో.
This post was last modified on December 14, 2022 5:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…