Political News

కేసీఆర్ ఏపీకి వ‌స్తే.. వీటికి స‌మాధానం ఏంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్‌.. త‌న జాతీయ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డం ఖాయం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం డిల్లీలో ఈ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం కాగానే 2024 సార్వ‌త్రిక స‌మరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న అన్ని రాష్ట్రాల్లోనూ క‌లియదిరుగుతారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ముందుగా ఈ జాబితాలో ఏపీ ఉంద‌ని అంటున్నారు. పొరుగునే ఉన్న‌రాష్ట్రం.. పైగా త‌న‌కు తెలిసిన రాజ‌కీయ నేత‌లు మెండుగా ఉన్న రాష్ట్రం కావ‌డంతో కేసీఆర్‌కుఏపీ చాలా తేలిక‌గా అందివ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టి.. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల‌పై ఫోక‌స్ పెడ‌తార‌ని అంటున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఆయ‌న ఇక్క‌డ కు వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఎందుకంటే.. అనేక‌ విష‌యాల‌పై ఇప్ప‌టికీ.. ఇక్క‌డ స‌మ‌స్య‌లు అలానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల‌తో ముడిప‌డిన విష‌యాలు స‌హా.. వ్య‌క్తిగ‌తంగా ఏపీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. వాటిని ఆయ‌న త‌ప్పించుకుని పోవాల‌ని అనుకున్నా.. ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌శ్న‌లు సంధించ‌డం ఖాయం. సో.. ఆయ‌న ఎలాంటి వైఖ‌రి అవ‌లంభిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఉదాహ‌ర‌ణకు.. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం. ఇక్క‌డ రైతులు.. మూడు సంవత్స‌రాలుగా 2020 నుంచి పోరు స‌ల్పుతున్నారు. సో.. వారికి ఆయ‌న ఏం చెబుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నాయ‌కుడు కాబ‌ట్టి.. దీనిపై స్పందించినా స్పందించ‌క‌పోయినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీరేపు ఆయ‌న జాతీయ పార్టీ నాయ‌కుడిగా వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డి రైతులుఆయ‌న‌కు ఈ విష‌యం విన్న‌విస్తే.. ఏం చెబుతారు? ఒక‌వైపు జ‌గ‌న్ మూడురాజ‌ధానులు అంటున్నారు. మ‌రోవైపు రైతులు అమ‌రావ‌తి కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఏం చెబుతారో చూడాలి.

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టు. ఈ విష‌యంపైనా కేసీఆర్ ఏం చెబుతారో అనేది మేధావుల మాట‌. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు ఇప్ప‌ట్లో పూర్త‌య్యేనా.. కాదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అస‌లు ఈ ప్రాజెక్టుపై గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కోర్టుకు వెళ్లింది. సో.. ఈ విష‌యంలో జాతీయ పార్టీ నాయ‌కుడిగా ఆయ‌న ఉద్దేశం ఏంటి. అనేది కూడా ఇప్పుడు తేల్చి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇక‌, రెండురాష్ట్రాల‌కు సంబంధించిన జ‌ల వివాదాల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారు? ఉద్యోగుల విభ‌జ‌న‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు..ఇలా.. అనేక‌ స‌మ‌స్య‌ల‌కు కేసీఆర్ ఏం చెబుతారో.. అనేది ప్ర‌శ్న‌గానే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చూడాలి.. మాట‌ల మాంత్రికుడు ఏపీలో అడుగు పెట్టి ఏం చేస్తారో .. అంటున్నారు మేధావులు.

This post was last modified on December 14, 2022 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

43 seconds ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

1 hour ago

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…

1 hour ago

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…

2 hours ago

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

2 hours ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

2 hours ago