ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళ వారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రూ. 2,500గా ఉన్న సామాజిక పింఛన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు కానుంది. మరోవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినె ట్ ఆమోదం తెలిపింది.
అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది. విద్యార్థులకు ట్యాబులను ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని స్వయంగా మంత్రులే విద్యార్థులకు అందించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పెన్షన్ పెంపు, ఆసరా కార్యక్రమంలో మంత్రులు పాల్గొనాలని కూడా సీఎం నిర్దేశించారు.
గడపగడప కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం మంత్రులు అందరికీ సూచించారు. జిల్లాల అధ్య క్షులతో కలిసి పని చేసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈనెల 16న గడపగడపకు ప్రభుత్వంపై సీఎం సమీక్ష చేయనున్నారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం విశేషం.
This post was last modified on December 14, 2022 12:03 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…