Political News

ఆంధ్రప్రదేశ్ లో ఘర్ వాపసీ అంత సులభమా..

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై చాలా రోజులైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఘరంగా ఓడిపోయింది. ఒక్క సారి కూడా కాదు.. రెండు సార్లు ఆ పని జరిగింది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అది. హేమాహేమలైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

హర్షకుమార్, కేవీపీ, పల్లంరాజు లాంటి నేతలు ఎటూ వెళ్లలేక పార్టీలోనే టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి రాష్ట్రాల్లో మార్పులు చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరుజాను నియమించారు. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ ఒక జంబో కమిటీని కూడా వేసింది. వచ్చిందే తడవుగా రుద్రరాజు చాలా మాటలు చెబుతున్నారు….

తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు రుద్రరాజు ద్విముఖ వ్యూహం అమలు చేయబోతున్నారట. గ్రామీణ స్థాయిలో తిరుగుతూ ఓటు బ్యాంకును పదిలం చేయబోతున్నానని రుద్రరాజు చెప్పుకుంటున్నారు. చాలా మంది నేతల్లాగే రుద్రరాజు కూడా పాదయాత్రలు చేస్తానని అంటున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తారని ఏపీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత రుద్రరాజు పాదయాత్ర మొదలవుతుందని,చెబుతున్నారు.

అదే టైమ్ లో నారా లోకేష్ పాదయాత్ర, పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కూడా ఉంటాయి. వారితో రుద్రరాజు ఎలా పోటీ పడగలరో చూడాలి. కాంగ్రెస్ కు కింది స్థాయిలో నేతలు ఉన్నారని, కేడర్ బలం ఉందని అందుకే పాదయాత్ర సక్సెస్ అవుతుందని రుద్రరాజు అనుచరులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మాత్రం అలాంటి అవకాశాలు లేవని ఇతర పార్టీల నేతలు అంటున్నారు…

రాష్ట్ర విభజన సమయంలో పార్టీని వీడి వెళ్లిపోయిన లీడర్లు, కేడర్లను తిరిగి రప్పించే ఘర్ వాపసీ కార్యక్రమం రుద్రరాజు మదిలో ఉన్న రెండో వ్యూహం. పార్టీకి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు రాజకీయాల్లో లేకపోయిన మీడియాకు తన అభిప్రాయాలు చెబుతూ క్రియాశీలంగా ఉంటున్నారు. లగడపాటి రాజగోపాల్ కూడా పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు రుద్రరాజు బృందం ఇప్పటికే ఒక జాబితాను రూపొందించింది.

పేరున్న నేతలతోపాటు… క్షేత్రస్థాయిలో పట్టు ఉండి పార్టీకి దూరమైన నేతలను స్వయంగా కలుసుకుని తిరిగి కాంగ్రెస్ లో పనిచేయాలని కోరబోతోంది. వైసీపీ, టీడీపీ పట్ల ఓటర్లు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కష్టపడితే కాంగ్రెస్ కు అవకాశం ఉంటుందని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరి రుద్రరాజు టీమ్ మాటలు వాళ్లు నమ్ముతారో లేదో చూడాలి..

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

4 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

6 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

6 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

6 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

8 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 hours ago