టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే ఇటీవల తమ జాతీయ పార్టీకి సంబంధించిన జెండాను ఆయన ఆవిష్కరించటం తెలిసిందే. అదే రోజా రంగు జెండాలో తెలంగాణ మ్యాప్ తీసేసి భారత దేశ మ్యాప్ పెట్టడం..తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితి అంటూ పేరు మార్చేసి.. ప్రాంతీయం నుంచి జాతీయం దిశగా అడుగులు వేయటం తెలిసిందే.
పార్టీ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చినంతనే పక్కనున్న ఏపీలో పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం.. పార్టీ ఆఫీసు పెట్టేందుకు అవసరమైన భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి వేళ.. బీఆర్ఎస్ కు ఏపీలో ఉన్న అవకాశాలు ఏమిటి? ఆ పార్టీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పెడితే మంచిదేనన్న ఆయన.. ‘ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ మద్దతు కావాలని బీఆర్ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే అప్పుడు సీఎం జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారంటూ తమకున్న అధిక్యధోరణిని తన మాటలతో చెప్పేశారు.
అదే సమయంలొ తన మాటకు పూర్తి భిన్నమైన వ్యాఖ్య కూడా ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. ‘‘మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే ఆలోచన లేదు. తెలంగాణ వద్దనుకొని ఏపీపైనే పూర్తి దృష్టి పెట్టాం. కర్ణాటక.. తమిళనాడు ఇలా ఇతరరాష్ట్రాల్లో పోటీ చేయొచ్చు. కానీ వైసీపీ ఏపీ ప్రజలకు అంకితమైన పార్టీ. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం తప్ప వేరే ఆలోచన లేదు. ఎవరొకరి చంక ఎక్కి గెలవాలి అనుకునే ఆలోచన లేదు. ఏపీ ప్రయోజనాలు పూర్తి చేసిన తర్వాత వేరే ఆలోచన చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి తాము ఎవరి చంక ఎక్కేందుకు సిద్ధంగా లేమని చెబుతూనే.. కేసీఆర్ నుంచి ప్రపోజల్ వస్తే మాత్రం ఆలోచిస్తామని చెప్పటం చూస్తే.. అవసరం ఎవరిదన్న విషయాన్ని సజ్జల వారు గులాబీ బాస్ కు బాగానే గుర్తు చేసినట్లుగా చెప్పక తప్పదు. మరి.. దీనికి కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
This post was last modified on December 13, 2022 8:56 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…