కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఏదో ఒక్క రోజు విచారణతో పని పూర్తయ్యిందనుకున్న బీఆర్ఎస్ నేతలకు అసలు విషయం తెలియడానికి కొంత టైమ్ పట్టింది. కవితకు సీబీఐ మరో నోటీసు పంపింది. తొలుత 160 సీఆర్పీసీ కింద ఏడున్నర గంటలు ఆమె నివాసంలోనే విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.
నిజానికి ఆమె నివాసంలోనే 160 సీఆర్పీసీ కింద ప్రశ్నించి 161 సీఆర్పీసీ కింద స్టేట్ మెంటి రికార్డు చేసిన సీబీఐ అధికారులు తాజాగా 91 సీఆర్పీసీ కింద నోటీసులు సర్వ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లు సమర్పించేందుకు రావాలని అధికారులు సందేశం పంపారు. హాజరు కావాల్సిన తేదీని, ప్రదేశాన్ని సస్పెన్స్ లో ఉంచినప్పటికీ ఆ పని ఢిల్లీలో త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే ఈ సారి మరిన్ని ప్రశ్నలు సిద్ధమవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
బీఆర్ఎస్ నేతల పై సీబీఐ, ఈడీ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయని కూడా తాజాగా సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.
బ్యాంకుల లావాదేవీలను తీసుకొచ్చి మరీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే జైల్లో ఉన్న శరద్ చంద్రారెడ్డి, అరోరాతో ఉన్న ఆర్థిక లావాదేవీలను అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజానికి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. అయితే అందుకు భిన్నంగా కవితను ఫిక్స్ చేసేందుకు శరద్ చంద్రారెడ్డి వాగ్మూలమే ప్రధానమవుతుందని భావిస్తున్నారు… అమిత్ అరోరా కేవలం పావు మాత్రమేనని, శరద్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ అసలు కింగ్ పిన్స్ అని సీబీఐ అనుమానిస్తోంది.
వాళ్ల ద్వారానే కోట్లాది రూపాయలు కవిత, సిసోడియాలకు అంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పుడు నిజం రాబట్టాలంటే మరింత లోతైనా విచారణ అనివార్యమవుతోంది. ఢిల్లీలో కూర్చోబెడితే అన్ని విషయాలు బయట పడతాయని సీబీఐ నమ్మకం.
This post was last modified on December 12, 2022 10:31 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…