చేసిన పాపం చెప్తే పోతుంది
చేసిన మంచి చెప్పకుంటే ఫలిస్తుంది
గుర్తుందా… సరిగ్గా 10 రోజుల క్రితం బస్సు కోసం వెళ్తున్న ఒక అంధుడి కోసం ఒక మహిళ పరుగెత్తి బస్సును ఆపి అంధుడిని ఎక్కించి పంపిన వీడియో గుర్తుందా? దేశమంతా ఆ వీడియో వైరల్ అయ్యింది. నిస్వార్థంగా ఆమె చేసిన మంచి పనికి ఇల్లు గిఫ్టుగా వచ్చింది. అద్భుతం కదా.
ఆ చిరుద్యోగి పేరు. సుప్రియ. కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లూరు ఆమె స్వంతూరు. అదే ఊర్లో జోయ్ ఆలుక్కాస్ లో పనిచేస్తున్నారు. చిరుద్యోగి. విధులకు వెళ్లే సమయంలో ఒక అంధుడు బస్సు కోసం ప్రయత్నించడం గమనించారు సుప్రియ. బస్సు అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి పరుగెత్తి బస్సును ఆపారు. అనంతరం ఆ అంధుడిని తీసుకొచ్చి ఎక్కించింది. తర్వాత తన దారిన తాను పోయింది.
బస్సు ఆపిన చోటులో పక్కనే ఉన్న ఓ భవనం పై నుంచి ఎవరో ఈ సంఘటనను వీడియో తీశారు. ఇది ఐపీఎస్ విజయ్ కుమార్ కు చేరింది. ఆయన ఆ వీడియోను పోస్టు చేస్తూ దయ కంటే మంచి ఏముంటుంది అంటూ కామెంట్ చేశారు. అది బాగా వైరల్ అయ్యి జోయ్ అలుక్కాస్ కంపెనీ యజమాని దృష్టికి వెళ్లింది.
దీంతో కంపెనీ యజమాని ఆమె మనసును గుర్తించి ఇంటికెళ్లి అభినందించారు. అదే ఆమె ఆనందానికి అవధుల్లేవు అన్నట్టు సంతోషపెట్టింది. ఓ చిన్న ఇరుకైన అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకున్న యజమాని మరుసటి రోజు ఆమెను త్రిస్సూర్ కి రమ్మని పిలిచారు. అక్కడికెళ్లాక ఏకంగా ఒక ఇల్లు గిఫ్టుగా ఇచ్చాడు. ఆమె సంతోషం పట్టలేక కన్నీరు పెట్టుకుంది. ఈ సంఘటన మనకు ఓ స్ఫూర్తి. మనం చేసే సాయం ఫొటోలు వీడియోలు తీసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు గమనిస్తాడు. భగవద్గీతలో చెప్పినట్లు మనం కర్మ చేయాలి. ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అది ఇంత అందంగా, అద్భుతంగా ఉంటుంది.
This post was last modified on July 16, 2020 9:05 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…