Political News

జెండా అదే.. అజెండానే మారింది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అనుకున్న‌ది సాధించే ఘ‌టంగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం.. ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ ఉద్య‌మ‌ పార్టీని త‌ర్వాత‌.. కాలంలో రాజ‌కీయ పార్టీగా మార్పు చేశారు. రాష్ట్ర సాధ‌న అనంత‌రం.. టీఆర్ ఎస్‌ను పొలిటిక‌ల్ పార్టీగా మార్చిన‌ట్టు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు అదేపార్టీని జాతీయ రాజ‌కీయాల కోసం.. భార‌త రాష్ట్ర‌స‌మితిగా మార్చారు.

దీనికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమ‌తి వ‌చ్చింది. దీనికి సంబంధించిన ప‌త్రాల‌పై సంత‌కాలు చేసే కార్య‌క్ర‌మం కూడా పూర్త‌యింది.ఖ‌చ్చితంగా పెట్టుకున్న ముహూర్తానికి.. తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ బీఆర్ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

స‌రిగ్గా శుక్ర‌వారం మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. దీంతో సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానంలో అలుపెరుగ‌ని సంచ‌ల‌నాలు సృష్టించిన టీఆర్ఎస్ చ‌రిత్ర‌లో క‌లిసిపోయి.. జాతీయ రాజ‌కీయ య‌వ‌నిక పై స‌రికొత్త పార్టీ బీఆర్ ఎస్ రూపంలో పురుడుపోసుకున్న‌ట్టు అయింది. అనంత‌రం.. బీఆర్ ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు.

అయితే.. పార్టీ బీఆర్ ఎస్‌గా మారినా.. జెండా మార‌లేదు. కేవ‌లం జాతీయ అజెండానే మారడం గ‌మ‌నార్హం. పార్టీ జెండాను గులాబీ రంగులోనే రూపొందించారు. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారత్‌దేశం మ్యాప్‌‌ను చేర్చారు. అదేవిధంగా పార్టీ జెండాపై జై తెలంగాణ బదులు.. జై భారత్‌‌గా మార్చారు.

జెండా ఆవిష్కరణ ముందే కండువాను ఆవిష్కరించిన కేసీఆర్.. తనకు తానుగా కండువాను మెడలో వేసుకున్నారు. అనంతరం ఆయ‌న ఎన్నిక‌ల సంఘం పంపించిన లేఖ‌పై సంత‌కాలుచేసి.. లాంచ‌నంగా పార్టీని ప్రారంభించారు. ఇక‌, కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న కర్ణాటక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, బ‌హుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

1 hour ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

3 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

3 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

3 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

5 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

5 hours ago