కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారు. ఇది అధికారికంగా పూర్తయింది. ఆయన తదుపరి లక్ష్యం జాతీయ పార్టీ గుర్తింపు సాధించడమే. మరి.. ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏమేం అర్హతలుండాలి.. బీఆర్ఎస్ జాతీయ పార్టీ గుర్తింపు పొందడం ఎలా?
ఏ పార్టీ అయినా జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం.. చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేయాలి. చెల్లుబాటైన ఓట్లలో ఆ పార్టీ ఆరు శాతం ఓట్లు సాధించాలి.
అంతేకాదు… ఆ పార్టీ నుంచి కనీసం నలుగురు ఎంపీలు ఎన్నికవ్వాలి. ఇది ఒకే రాష్ట్రం నుంచి కావొచ్చు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కావొచ్చు.
అంతేకాదు.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
లేదంటే… మునుపటి సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. అది కూడా మూడు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు గెలవాలి.
ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందాలంటే…
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలి.. అక్కడ చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.
లేదంటే.. ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
లేదంటే ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
లేదంటే… ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
లేదంటే… లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
అయితే, ఏదైనా పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు. పైన చెప్పుకొన్న అర్హతలు మెంటైన్ చేస్తేనే ఈ గుర్తింపు, హోదా కంటిన్యూ అవుతాయి. లేదంటే గుర్తింపు కోల్పోతాయి.
ఇండియాలో ఇప్పుడు ఎన్ని జాతీయ పార్టీలున్నాయి
2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి.
1) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2) భారతీయ జనతా పార్టీ
3) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – సీపీఐ
4) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఎం
5) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
6) బహుజన్ సమాజ్ పార్టీ
7) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
8) నేషనల్ పీపుల్స్ పార్టీ
This post was last modified on December 10, 2022 12:06 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…