న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా నాని, ఎస్జె సూర్య మధ్య కెమిస్త్రి ఓ రేంజ్ లో పేలింది. అందుకే ఆ మేజిక్ ని మళ్ళీ ఇతర భాషల్లో రీ క్రియేట్ చేయలేమని భావించి చాలా మంది రీమేక్ ఆలోచనలు మానుకున్నారు.
ఆ మధ్య కార్తీక్ ఆర్యన్ తో హిందీలో చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది కానీ వర్కౌట్ కాదేమోననే ఉద్దేశంతో నిర్మాతలు నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితేనేం నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాక్షన్ మూవీని కోట్లాది ప్రేక్షకులు చూసేశారు.
ఇప్పుడీ సరిపోదా శనివారం జపాన్ లో రిలీజవుతోంది. సూర్యాస్ సాటర్డే పేరుతో ఫిబ్రవరి 14 అక్కడి ఆడియన్స్ కోసం థియేటర్లకు తీసుకొస్తున్నారు. నిజానికిది కొంత రిస్క్ తో కూడుకున్నదే. ఎందుకంటే అక్కడ విడుదలైన అన్ని ఇండియన్ మూవీస్ ఒకే స్థాయిలో విజయం సాధించలేదు.
కల్కి 2898 ఏడికి ఆదరణ దక్కలేదు. టీమ్ వెళ్లి ప్రమోషన్లు చేసినా ఓపెనింగ్ తప్ప లాంగ్ రన్ దొరకలేదు. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించింది. బాహుబలి 2 కూడా సూపర్ హిట్టే. ఇవి కాకుండా ముత్తు, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఇంగ్లీష్ వింగ్లిష్, 3 ఇడియట్స్, లంచ్ బాక్స్ ఉన్నాయి.
ఇవన్నీ గమనిస్తే ఏదో ఒక యూనీక్ పాయింట్ తో రూపొందిన సినిమాలు. వీటిలో చిన్న బడ్జెట్ వి కూడా ఉన్నాయి. మన ఇండియన్ ఎమోషన్స్ ని జపాన్ జనాలు బాగా ఇష్టపడతారు. అవి సరిగ్గా పండితే వసూళ్ల వర్షం కురిపిస్తారు. కానీ సరిపోదా శనివారంలో ఎలివేషన్లు, యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ.
నాని అక్క, తండ్రి పాత్రలకు భావోద్వేగాలు పెట్టారు కానీ అవెంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకవేళ హిట్ అయితే మాత్రం నానికి జాక్ పాట్ తగిలినట్టే. హాయ్ నాన్న, దసరా లాంటివి జపాన్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇటీవలే జరిగిన టెరుకోర్ ఈవెంట్ లో సరిపోదా శనివారంకు భారీ రెస్పాన్స్ వచ్చింది.
This post was last modified on February 5, 2025 10:57 am
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…