ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ వేశారు. ఆయన తరచుగా చెబుతున్నట్టు.. గెలిచితీరాలనే సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఎవరికీ ఇబ్బంది లేని రీతిలో వ్యూహాత్మక రాజకీయానికి తెరదీశారు. అదే.. గృహ సారథులు
కాన్సెప్ట్. దీనిని సీఎం జగన్ తాజాగా తన పార్టీ సమన్వయ కర్తలు, పరిశీలకులకు చెప్పారు.
గృహ సారథులు అంటే.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు వలంటీర్లను నియమిస్తారు. వీరిలో ఒకరు ఖచ్చితంగా మహిళ ఉండాలి. వీరిద్దరూ కూడా.. ఆ 50 ఇళ్ల పరిధిలో కుటుంబాలను తరచుగా కలుస్తుండాలి. ప్రబుత్వ పథకాలు వస్తున్నాయా? రావట్లేదా తెలుసుకోవాలి. వస్తుంటే.. నెలనెల లేదా.. ఏడాది గ్రాస్‌గా ఎంత మొత్తంగా వారు ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు.
అనే విషయాన్ని వారికి వివరించి.. వైసీపీకి ఓటేయించేలా చేయాలి. ఒకవేళ పథకాలు రాకపోతుంటే.. వారి అర్హతను బట్టి ఏదో ఒక పథకం వారికి ఇప్పించే లా సిఫారసు చేయాలి. మొత్తంగా.. ఈ 50 ఇళ్లలోని పురుషులు, మహిళలను ఈ గృహసారథులు.. వైసీపీవైపు మళ్లించగలగాలి. అయితే.. ఇప్పటికే వలంటీర్లు ఉన్నారనే సందేహం వస్తుంది.
వలంటీర్లు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రభుత్వంతో ముడి పడిఉన్నారు. సో.. వారితో రేపు ఎన్నికల సమయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల .. వారిని ఎలక్టోరల్ విధులకే దూరం పెట్టింది. సో రేపు.. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిలువరిస్తుంది. అందుకే.. గృహసారథులు కాన్సెప్ట్‌ను తెరమీదికి తెచ్చారు.
వీరికి ఏమిస్తారంటే..
గృహసారథులుగా నియమితులయ్యేవారు చురుగ్గా ఉండాలి. 18-35 ఏళ్లలోపు వారై ఉండాలి. యాక్టివ్‌గా పార్టీ కోసం పనిచేయాలనే సంకల్పం ఉన్నవారు అయి ఉండాలి. వీరికి ఎలాంటి జీతం ఉండదు. కేవలం 5 లక్షలకు కుటుంబ బీమా చేయిస్తారు. పార్టీ కీలక సమావేశాలకు ప్రతినిధులుగా పిలుస్తారు.
This post was last modified on December 9, 2022 9:45 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…