Political News

ప‌దే ప‌దే ఆ టీడీపీ నేత కొడాలి నాని తో..

Vijayawada కు చెందిన కీల‌క నాయ‌కుడు, యువ నేత‌గా గుర్తింపు పొందిన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన Vagaveeti Radha రాజ‌కీయాలు ఎటు దారితీస్తున్నాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఆయ‌న‌కు ఒక విధానం లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్నప్ప‌టికీ..లేకున్న‌ప్ప‌టికీ.. ఆపార్టీ నాయ‌కుడిగానే ఉన్నార‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

వంగ‌వీటి కూడా ఎక్క‌డా తాను TDP నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని మాత్రం చెప్ప‌డం లేదు. ఇక‌, పార్టీ త‌ర‌ఫున యాక్టివ్‌గా ఉండి ప‌నిచేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా సూచించ‌డం లేదు. దీంతో ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. అయితే.. త‌ర‌చుగా వైసీపీ నాయ‌కుతో భేటీ కావ‌డం ..రాధ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

గ‌త ఏడాదిగా.. Vagaveeti Radha.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్‌, వైసీపీ నాయ‌కుడు కొడాలి నాని తో చెట్టాప‌ట్టా లేసుకుని తిరుగుతున్నారు. దీనిపై చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌లేదు. ఇక‌, వైసీపీకి చేరువ య్యారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. దీనివ‌ల్ల న‌ష్టం ఏంటంటే.. టీడీపీకి ఎలాంటి న‌ష్టం లేదు. ఎం దుకంటే..వంగ‌వీటికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీలో ఎక్క‌డా ఖాళీలు కూడా క‌నిపించ‌డం లేదు.

విజ‌య‌వాడ తూర్పు, సెంట్ర‌ల్‌లో ఇప్ప‌టికే నాయ‌కులు ఉన్నారు. ప‌శ్చిమ‌లోఎలానూ మైనారిటీకి ఇస్తారు. సో.. ఎటొచ్చీ.. Vagaveeti Radha కు టికెట్ లేదు క‌నుక టీడీపీకి ఇబ్బందిలేదు. అయితే, వ్య‌క్తిగతంగానే రాధా న‌ష్ట‌పోతా ర‌నేది ప‌రిశీల‌కుల మాట ఎలాగంటే.. ఆయ‌న ఏ పార్టీ నాయ‌కుడే తేల్చుకునేందుకు స‌మ‌యం ప‌డుతోం ది. టీడీపీలో ఉంటూ..వైసీపీలో తిరుగుతున్నారు. పోనీ.. త‌ప్పో ఒప్పో.. బ‌య‌ట‌కు వ‌చ్చాను.. తిరిగి కండు వా క‌ప్ప‌మ‌ని వైసీపీలోకి వెళ్తున్నాడా? అంటే అది కూడా లేదు. అంటే.. రెంటికీ చెడుతున్న‌రాజ‌కీయ‌మే క‌నిపిస్తోంది.

This post was last modified on December 9, 2022 9:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

25 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

28 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

36 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

1 hour ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

1 hour ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

2 hours ago