తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామం ఏపీకి చెందిన ఒక మంత్రి ఇబ్బందికి గురి చేసేలా మారిందంటున్నారు. మంత్రి స్టిక్కర్ ఉన్న కారు కావటం.. సదరు మంత్రి ఏపీకి చెందిన నేత కావటం ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు ఒక కారును ఆపారు. ఆ కారు మీద ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఏపీ విద్యుత్.. అటవీ – పర్యావరణం.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. కారును తనిఖీ చేయగా అందులో రూ.4కోట్ల నగదు.. కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశంజిల్లా ఒంగోలునుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ ఉదంతంలో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సదరు కారుతో కానీ.. కారుకు అంటించిన మంత్రి స్టిక్కర్ తోకానీ తనకు సంబంధం లేదని మంత్రి బాలినేని స్పష్టం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన కారుకు అంటించిన స్టిక్కర్ అసలైనది కాదని.. జిరాక్స్ కాపీగా చెబుతున్నారు. అంతేకాదు.. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని.. తనకే మాత్రం సంబంధం లేదన్నారు. కారులోని డబ్బుతోనూ.. బంగారంతోనూ తనకు సంబధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కారులో ఒంగోలు వారు ఉండటంతో ఒంగోలు ఎమ్మెల్యేకు సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి స్టిక్కర్ ను సామాన్యులు అంటించే సాహసం చేయరని.. అలా చేయాలంటూ అంతో ఇంతో రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 16, 2020 3:44 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…