ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని.. 30 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతామని చెబుతున్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత Jagan తెలుసుకోవాల్సిన పాఠాలు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే.. జనం ఏం కోరుకుంటున్నారో.. అర్ధమవుతోంది.
ఏపీ విషయానికి వస్తే.. ప్రజలకు నేను మూడేళ్ల కాలంలో 4 లక్షల కోట్ల రూపాయలను పంచానని.. నాకు తప్ప ఓటు వేయొద్దని .. సీఎం జగన్ చెబుతున్నారు.కానీ, నిజంగానే జనం ఉచితాలకు ఓటేస్తున్నారా? విజన్‌కు, పాలనకు ఓటేస్తున్నారా? అంటే.. ఖచ్చితంగా విజన్‌కు, పాలనకే వారు ఓటెత్తుతున్నారు.ఈ విషయంలో మరో మాటే లేదు. ఎందుకంటే.. గుజరాత్ ఫలితమే దీనికి నిదర్శనం.
ఇక్కడ పోటీ చేసిన AAP అనేక ఉచితాలు ప్రకటించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకురూ.2000 చొప్పున సామాజిక పింఛన్, ఉచిత సైకిళ్లు, మోపెడ్లు.. ఇలా అనేక ఉచితాలు ప్రకటించింది. అయినా.. ప్రజలు ఆప్‌ను పట్టించుకోలేదు. మరో కీలక పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఉచితాలకు పెద్దపీట వేసింది. ఇక, అధికార పార్టీ BJP మాత్రం ఉచితాలకు దూరంగా ఉంది.
దాదాపు మేనిఫెస్టోలో ఒకటి రెండుతప్ప.. ఉచితాలు లేనేలేవు. అయితే, అదేసమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు ము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, నర్మదా నది నీటిని ప్రజలకు అందించామని.. మరోసారి అధికారంలోకి వస్తే.. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం చేస్తామని.. ప్రకటించింది. ప్రజలు ఈ వాగ్దానాలకే పట్టం కట్టారు. కట్ చేస్తే.. ఏపీలోనూ.. ప్రజలు ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు.
వందల మంది కడుతున్న పన్నులను పది మందికి పంచే సంస్కృతిని కోరుకోవడం లేదు. ఇలా డబ్బులు పంచడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని మెజారి టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఫలితం అటు హిమాచల్‌లోనూ.. ఇటు Gujarat లోనూకనిపించిన దరిమిలా.. జగన్ దీని నుంచి నేర్చుకుంటారో.. లేక విస్మరిస్తారో చూడాలి.
This post was last modified on December 8, 2022 9:29 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…