ఏపీ గురించి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఏం మిగిలింది? ఇదీ.. ఇప్పుడు పబ్లిక్ టాక్. ఎన్నికలకు సమ యం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రజలను కలుస్తున్నాయి. వారు ఏం చెబుతారా? అని మైకు గొట్టాలు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు చెబుతు న్న మాట చాలా ఆలోచనాత్మకంగా ఉండడం గమనార్హం.
ఏం చెబుతాం.. ప్రాంతాలు.. కులాల మధ్య ఇప్పుడు వివాదాలు తెర మీదికి వస్తున్నాయి. మూడు ప్రాంతా లుగా ప్రజలు విడిపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది
అని మేధావులు అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా.. ఏపీలో పరిణామాలను గమనిస్తే.. వీరి అభిప్రాయం కూడా నిజమేనని తెలుస్తోంది. ఇటీవల విశాఖలో వైసీపీ నాయకులు రాజధాని సభను ఏర్పాటు చేశారు.
రెండు రోజుల కిందట కర్నూలులో సీమ గర్జన సభ పెట్టారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజలు తమ ముందుకు వచ్చిన చానెళ్ల ముందు నిర్మొహమాటంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అదేసమయంలో కులాల గురించి కూడా ప్రస్తావన చేస్తున్నారు. కులాల మధ్య కుంపట్లు పెట్టేలా.. వ్యవహరిస్తున్నారు
అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏపీలో పరిస్థితి కులాలు-ప్రాంతాల మధ్య రాజకీయంగా మారిపోయిందనే టాక్ అయితే జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ఇక, ఎన్నికల నాటికి ఈ వాదన మరింత బలంగా వినిపించినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. నిజానికి గత ఎన్నికలకు ముందు.. అభివృద్ధి గురించిన ప్రస్తావన రాష్ట్రంలో ఎక్కువగా జరిగింది. ప్రజలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయి.. ప్రాంతాలు, కులాలుగా చర్చ జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on December 7, 2022 7:58 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…