Political News

మాగుంట కొత్త తంటా

కవిత తర్వాత మాగుంటేనన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ వర్గాల్లోనూ అదే భయం నెలకొంది. ఆయనకు తొందరలో నోటీసులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కవిత నుంచి ఈనెల 11న వివరణ తీసుకున్న తర్వాత దాని ఆధారంగా లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సీనియర్ లీడర్. ఆయన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంగా 1998లో మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ కుటుంబంగా పేరు పొందిన మాగుంట.. ఒంగోలు పార్లమెంట్ నుండి మూడు సార్లు కాంగ్రెస్ ఎంపీగా, ఒకసారి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. ఏ పార్టీలో ఉన్నా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని కాపాడుకుంటున్నారు. రాజకీయాలతోపాటూ మాగుంట కుటుబం గత 70 ఏళ్ల నుండి మద్యం వ్యాపారం చేస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీలో మాగుంట ఆగ్రోస్ పేరుతో ఆయన కుటుంబ సభ్యులు మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు.

 ఢిల్లీ మద్యం వ్యాపారంలో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించడం.. వెనువెంటనే సీబీఐ, ఈడీ దర్యాప్తు మొదలు పెట్టడంతో మాగుంట పేరు బయటకొచ్చింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో రెండు జోన్లు దక్కించుకుని మాగుంట కుటుంబ సభ్యులు లిక్కర్‌ వ్యాపారం చేశారు. అయితే.. మద్యం వ్యాపారంలో భాగంగా అమిత్ అరోరాకి ఎమ్మెల్సీ కవిత, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిసి 100 కోట్లు ముడుపులు చెల్లించినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. దీంతో.. వైసీపీ ఎంపీ మాగుంట వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌ అయింది.

 లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ విచారించింది. రాఘవరెడ్డిని విచారించిన తర్వాత అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం తీవ్ర చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి కొడుకుని వారసుడిగా ప్రకటించాలని మాగుంట ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తండ్రీకొడుకులు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చిక్కుకోవడం వైసీపీతోపాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇంత జరుగుతున్నా స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట అంటున్నారు. అయితే ధైర్యమంతా పైపైనే అని… లోలోన భయపడుతున్నారని సన్నిహితవర్గాల సమాచారం. అరెస్టుల పర్వం కొనసాగితే మాగుంట కుటుంబ వంతు కూడా రావచ్చని భయపడుతున్నారు. ఏదైనా ఈడీ, సీబీఐ దయ అని సరిపెట్టుకుంటున్నారు….

This post was last modified on December 8, 2022 6:15 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

22 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago