రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించడం ఒకప్పటి లెక్క. కానీ, ఇప్పుడు అసలు ప్రత్యర్థులే లేకుం డా చూసుకోవడం ప్రధాన లెక్కగా రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆదిశగానే అడుగులు వేస్తు న్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్న తెలంగాణ, ఏపీల్లో మాత్రం ప్రత్యర్థి పార్టీపై రాజకీయ నేతలు ఇలాంటి రాజకీయాలే చేస్తున్నాయి. తెలంగాణ విషయాన్ని తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికా రంలోకి రావాలని బీజేపీ స్కెచ్ సిద్ధం చేసుకుంది.
సీఎం కేసీఆర్ వంటిబలమైన నాయకుడిని ఓడించడం ద్వారా బీజేపీ పుంజుకునే వ్యూహానికి రెడీ అయిం ది. ఇక, ఈ పార్టీ అనుకున్నదే తడువుగా.. కేసీఆర్‌ను ఓడించేందుకు నాయకుడు దొరకాలి కదా! అంటా రా? అది కూడా జరిగిపోయింది. తెలంగాణ కేసీఆర్ బాధితుడిని అని చెప్పుకొనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం పై పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడమే ధ్యేయంగా రాజేందర్ పావులు కదుపుతున్నారు.
ఈయన దూకుడును అర్ధం చేసుకున్న బీజేపీ.. పెద్దగా కష్టపడకుండానే పనిపూర్తి చేసుకోవచ్చని నిర్ణయిం చుకుందో ఏమో.. వెంటనే ఈటలను ఢిల్లీకి పిలిచి.. దిశానిర్దేశం చేసి బ్లూ ప్రింట్ కూడా ఇచ్చిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కొందరు.. కాదు.. ఈ సారి తన నియోజకవర్గం మార్చుకుంటారని మరికొందరు అంటున్నారు.
సరే.. కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీ చేసినా.. ఆయనను ఓడించి తీరుతానని ఈటల పంతంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే,ఇక్కడి ప్రజలను ఎలా నమ్మించాలి.. వారి ఓట్లు ఎలా పొందాలి? అనే విషయాలపైకసరత్తు ముమ్మరం చేసిన ఈటల.. తనకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
పార్టీకి.. రాష్ట్రానికి తాను ఎంతో సేవ చేశానని.. అయినాకేసీఆర్ తనకు వెన్నుపోటు పొడిచారంటూ ఆయన ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా చూస్తే..కేసీఆర్‌ను ఓడించేందుకు ఈటల రెడీ అయినా.. ఇది సక్సెస్ కావాలంటే బలంగానే పోరాడాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 5:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…