Political News

బీజేపీ అలా.. జీవీఎల్ ఇలా.. వాటీజ్ దిస్ బాస్‌!!

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఒక విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. రాష్ట్రంలోని కీల‌క నాయ‌కుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మాత్రం త‌న రూటే సెప‌రేటు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు బాగా జ‌రిగాయ‌ని, కానీ, తాను ఆనాడు చూడ‌లేక పోయాన‌ని అన్నారు. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రిగా నితిన్ గ‌డ్క‌రీ ఉన్నారు.

అంటే.. ఒక ర‌కంగా.. షెకావ‌త్‌.. నాటి చంద్ర‌బాబు స‌ర్కారుకు యోగ్య‌తా ప‌త్రం ఇచ్చార‌నే చెప్పాలి. ఇది జ‌రిగి మూడు నెల‌లు కూడా కాలేదు. కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు మౌనంగా ఉండిపోయారు. అయితే, ఇప్పుడు ఇదే బీజేపీకి చెందిన రాష్ట్ర నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు.. అదే చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. “వాటీజ్ దిస్ బాస్‌!” అని నెటిజ‌న్ల‌తో అనిపించేలా చేసింది.

తాజాగా మ‌రోసారి ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల‌ ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. గురువారం రాత్రి పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శిస్తాన‌ని కోరారు. అయితే, దీనికి అధికారులు అడ్డంకులు చెప్ప‌డం.. ఆయ‌న ధ‌ర్నా చేయ‌డం ఇవ‌న్నీ ఒక‌ర‌కంగా తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీశాయి. రాజ‌కీయంగా అదికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య యుద్ధానికి కూడా కార‌ణ‌మ‌య్యాయి. అయితే. ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న జీవీఎల్ ఫ‌క్తు వైసీపీ డ్యూటీ ఒప్పుకొన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

“జీతం బీజేపీ నుంచి తీసుకుంటూ.. ప‌ని మాత్రం వైసీపీ దొడ్లో చేస్తున్నారా?” అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు హ‌యాంలో ఒక్క ప్రాజెక్ట‌యినా క‌ట్టారా? అని జీవీఎల్ ప్ర‌శ్నించ‌డ‌మే. మ‌రి ప‌ట్టిసీమ క‌ట్టిందెవ‌రు? అనేదానికి ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. న‌దుల అనుసంధానం చేయాల‌ని, చేసింది.. ఎవ‌రు జీవీఎల్ ద‌గ్గ‌ర స‌మాధానం దొర‌క‌దు. కానీ, చంద్ర‌బాబుపై మాత్రం యాగీ చేయాలి.

ఆయ‌న‌ను బ‌ద్నాం చేయాలి.. ఇదే జీవీఎల్ డ్యూటీగా పెట్టుకున్నారా? అనేది నెటిజ‌న్ల టాక్‌. పోనీ.. పోల‌వ‌రంపై ఇంత ప్రేమ కురిపిస్తున్న జీవీఎల్‌.. త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి ఒక బ‌స్తా సిమెంటు తీసుకువ‌చ్చారా? అనేది కూడా నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్నే. మొత్తానికి తాజాగా జీవీఎల్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కే బూమ‌రాంగ్ అవుతున్నాయి.

This post was last modified on December 4, 2022 9:56 pm

Share

Recent Posts

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

2 minutes ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

1 hour ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

4 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

5 hours ago