Political News

కేసీఆర్ సామాజిక న్యాయం ఇదే.. రేవంత్ ఫైర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై పీసీసీ అద్య‌క్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సామాజిక న్యాయం ఇదేనా ? అని నిల‌దీశారు. “సామాజిక న్యాయం అంటే నాలుగు కులాల‌కు చెందిన ‘త‌న’ అనుకున్న‌వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి వారిని ప‌క్క‌న కూర్చోబెట్టుకోవ‌డ‌మేనా?” అని రేవంత్ నిల‌దీశారు. ఆధిప‌త్య రాజ‌కీయాల‌ను ఎండ‌గ‌ట్టిన తెలంగాణ‌లో ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌ని అన్నారు.

తెలంగాణ అనగానే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివ‌ర్సిటీ అని రేవంత్ తెలిపారు. ఈ యూనివ‌ర్సిటీ విద్యార్థులు రాష్ట్రం కోసం ఎంత కైనా పోరాడార‌ని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్‌పైనా.. ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాల‌పైనా విరుచుకుప‌డ్డారు. రాష్ట్ర ఏర్ప‌డిన చాలా ఏళ్ల తరువాత ఉస్మానియా యూనివ‌ర్సిటీలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోందన్నారు. తెలంగాణ.. ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను కోల్పోలేదని తెలిపారు.

ఉద్యమకారులు ఎవ‌రో, ఆ ముసుగులో దోచుకుంటున్న‌ది ఎవ‌రో అంద‌రి తెలిసిందేన‌ని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, వారి ఆకాంక్ష‌ల‌ను సోనియాగాంధీ నెర‌వేర్చార‌ని రేవంత్ గుర్తు చేశారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి టీఆర్ఎస్ గద్దెనెక్కిందన్నారు. 1200 మంది కుటుంబాల త్యాగాల‌కు ఆర్థిక సాయం, ఉద్యోగం, 3ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్.. ఇప్ప‌టివ‌ర‌కు ఏం చేసింద‌ని నిల‌దీశారు.

అంతేకాదు.. క‌నీసం 550 కంటే ఎక్కువ మంది అమరుల కుటుంబాల‌ను గుర్తించేందుకు కూడా కేసీఆర్ ప్ర‌బుత్వానికి మ‌న‌సు రావ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉద్య‌మ‌కారులు, త్యాగ‌ధ‌నుల అడ్రస్ తెలియదని ప్రభుత్వం చెబుతోందని మండిప‌డ్డారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? అని రేవంత్ మండిప‌డ్డారు. తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? అని నిల‌దీశారు.

తెలంగాణ సాధించుకుంది కేసీఆర్ కుటుంబం, బంధువులు బాగుపడటానికేనా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో అన్యాయమే జరుగుతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on December 4, 2022 11:12 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

1 hour ago

సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!

కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…

2 hours ago

తారక్ హృతిక్ జోడి కోసం క్రేజీ కొరియోగ్రాఫర్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…

3 hours ago

పుష్ప 2 ఖాతాలో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…

4 hours ago

ఏక్ష‌ణ‌మైనా.. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. రంగం రెడీ?

దేశ రాజ‌ధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్ర‌మేన‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…

5 hours ago

మృణాల్‌కు ముద్దు భయం

ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…

14 hours ago