Political News

ఆయన మగతనంతో నాకు పనేంటి: షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారు అద్దాలు ధ్వంసం చేయడం, బస్సుకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక, కారులో షర్మిల కూర్చొని ఉండగానే ఆమె కారును క్రేన్ సాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఆ తర్వాత ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం తెలంగాణలో రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసైకి షర్మిల తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల…గత 2 రోజులుగా జరిగిన ఘటనలను గవర్నర్‌ కు వివరించానని అన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకున్నా తనను అరెస్ట్ చేశారని, వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారని ప్రశ్నించారు.

తాను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమీ అనలేదని అన్నారు. అయినా, ఆయన మగతనంతో నాకేం పని అంటూ షర్మిల సంచలన కామెంట్లు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తుంది, నాకేమి అవసరం అంటూ ఫైర్ అయ్యారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనను మరదలు అంటే దానికి బదులుగా తాను చెప్పుతో కొడతా అని దీటుగా జవాబిచ్చానని చెప్పారు. ఆయనంటే తప్పు లేదని, తానన్న మాటే తప్పా అని ప్రశ్నించారు. ఆయన కేసు పెడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని, తాను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఇదేనా మహిళలకున్న గౌరవం అని నిలదీశారు. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అని, తాను కేసు పెడితేనే తీసుకోవడం లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, టీఆర్ఎస్ నేతలపై సంచలన విమర్శలు గుప్పించిన షర్మిల…టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, దేశంలో కేసీఆర్ ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అని ఆరోపించారు.

తెలంగాణలో తాలిబన్ల మాదిరి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, టీఆర్ఎస్ వారంతా తాలిబన్లని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ విమర్శించారు.

This post was last modified on December 1, 2022 10:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago