ఔను.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు కర్నూలు చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ నేతలు.. పైకి చెబుతున్నా రు. అధికార వైసీపీ నాయకులు మాత్రం అంతర్గతంగా మథన పడుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల్లోనూ కర్నూలు కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. అసలు ఎందుకు కర్నూలు హాట్ టాపిక్ అయింది? అనేది ప్రశ్న. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో పర్యటించారు. ఇక్కడ ఆయన రోడ్ షో చేశారు.
దీంతో ఆయనను చూసేందుకు ప్రజలు సహజంగానే వచ్చారు. అర్ధరాత్రి వరకు సాగిన రోడ్ షోలను కూడా వీక్షించారు. దీంతో టీడీపీలో కొత్త జోష్ అయితే.. కనిపించింది.ఇక, ఎమ్మిగనూరు, నంద్యాలలో జరిగిన సభకు కూడా భారీ ఎత్తున జనం వచ్చారు. ఈ పరిణామాలు.. వైసీపీలో కలవరం పుట్టించాయనే చెప్పాలి. కానీ, ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. ఆది నుంచి కూడా కర్నూలు.. టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి.
ఒకవైపు.. కేఈ వర్గం, మరోవైపు కోట్ల వర్గం టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండేవి. అయితే, తర్వాత కోట్ల కూడా టీడీపీ వైపు రావడం.. స్వయంగా ఆయనే ప్రజల్లోకి వెళ్లడం.. వంటి పరిణామాలతో టీడీపీ కి జోష్ పెరిగిన మాట వాస్తవం. కానీ, వైసీపీ పరిస్థితి ఏంటంటే.. గత ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ పుంజుకుంది. 2014లో కర్నూలు ఎంపీ సీటును గెలుచుకున్నా.. పుంజుకోలేదు. గత ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది.
దీనిని బట్టి.. ఒక్క ఛాన్స్ అన్న వైసీపీ వైపు ఇక్కడి ప్రజలు ఒక్క సారి చూసినట్టుగా చెబుతున్నారు పరిశీలకులు. ఇప్పటికే మూడేళ్లు గడిచిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలు..మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సభలు, ర్యాలీలు విజయవంత మయ్యాయయని అంటున్నారు. ఇక, బాబు కూడా కర్నూలు సక్సెస్‌తో రాష్ట్ర వ్యాప్తంగా సభలకు రెడీ అవుతున్నారు. ఈ పరిణామమే రెండు పార్టీల్లోనూ రాజకీయంగా చర్చకు వచ్చేలా చేసింది.
This post was last modified on November 30, 2022 3:46 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…