ఏపీలో ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా కోరుతున్న.. డిమాండ్ చేస్తున్న.. విన్నవిస్తున్న.. కీలకమైన అంశానికి అనుకూలంగా ఏపీ సర్కారు అడుగులు వేసింది. వారిని.. బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. అంటే.. ఇకపై.. రాష్ట్రంలో టీచర్లు.. కేవలం పాఠాలు, పాఠశాలలు, విద్యార్థులు, పుస్తకాలకే పరిమితం కానున్నారు. సో.. ఇది మంచిదే. దేశంలోనే ఎప్పటినుంచో ఉన్న ఈ డిమాండ్‌ను వైసీపీ సర్కారు నెరవేర్చిందనే చెప్పాలి.
స్వామి కార్యం.. స్వకార్యం కూడా..!
ఇక్కడే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉపాధ్యాయులకు మేలు చేస్తున్నట్టు కనిపిస్తూనే.. మరోవైపు.. తనకు కీలకమైన ఎన్నికల విధుల నుంచి వారిని పక్కాగా తప్పించేసింది. అంటే, రేపు ఏ ఎన్నికల్లోనైనా టీవర్లదే కీలక పాత్ర. ప్రస్తుతం వారంతా సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నార. ఈ వ్యతిరేకతను తప్పించేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుంది. అసలు టీచర్లే లేకుండా ఎన్నికలు జరిగితే ఈ గోలే ఉండదు. అనే వ్యూహంతో జగన్ ప్రభుత్వం నిర్ణయం ఉన్నట్టు తెలుస్తోంది.
ఏం జరిగింది?
ఏపీలో ఉపాద్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచేలా వారి సర్వీసు రూల్స్‌కు ప్రభుత్వం సవరణ చేయబోతోంది. బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమవుతాయి. నిజానికి ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. సార్వత్రిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా ఎన్నిక సజావుగా సాగేలా చూడటం వారి బాధ్యత. ప్రజలు వారి ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే ప్రక్రియలో టీచర్లే ప్రత్యక్ష సాక్షలుగా నిలుస్తారు.
అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ వర్గాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టున్నాయి. వారి డిమాండ్లు అటుంచి అసలు జీతాలు, సాధారణ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో పొందడానికే నానా పాట్లు పడాల్సిన దుస్థితి ఏర్ప ఉంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావన వచ్చింది. అయితే అందులోనూ ఈ విషయంలో ఉపాధ్యాయులు మరింత ఫైర్ అవుతున్నారు. అందుకే గతేడాది విజయవాడలో నిర్వహించిన వారీ ధర్నాలో ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించి, అది విజయవంతం అవ్వడానికి కారణమయ్యారు.
అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పలురకాల మొబైల్ యాప్లతో సతమతమవుతున్న టీచర్లకు ఇది మింగుడుపడలేదు. అనంతరం ముఖ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు మౌనం వహించినా అసం తృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ఇవన్నీ గమనిస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో టీచర్లు వ్యతిరేకంగా ఉంటారనే అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కసరత్తు చేస్తోంది.
This post was last modified on %s = human-readable time difference 12:03 pm
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…