Political News

జ‌గ‌న్‌తో, ఆ రాష్ట్రంతో మ‌న‌కెందుకు-విజ‌య‌మ్మ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి విజ‌య‌మ్మ స్వ‌యానా త‌ల్లి. కొన్ని నెల‌ల ముందు వ‌ర‌కు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌర‌వ అధ్య‌క్షురాలు కూడా. ప‌ది సంవ‌త్స‌రాల‌కు పైగా ఆమె ఆ హోదాలో ఉన్నారు. వైకాపా త‌ర‌ఫున ఆమె ఎంపీగా పోటీ చేశారు. కొన్నేళ్ల పాటు ఆమె రాజ‌కీయం ఏపీలోనే సాగింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆమె జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో మ‌న‌కెందుక‌మ్మా అంటూ మీడియా ముందు మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

కొన్ని నెల‌ల కింద‌టే వైకాపా గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేసి.. తెలంగాణ‌లో ష‌ర్మిళ పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోసం ప‌ని చేస్తున్న ఆమె.. తాజాగా త‌న కూతురి అరెస్టు నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మంగ‌ళ‌వారం షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నివాసంలో దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జరిగిన పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారా… ఎంతైనా సోద‌రి కదా? అని ఓ మీడియా ప్రతినిధి విజ‌య‌మ్మ‌ను ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ, ”ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఓ అన్నగా జగన్ మోహన్ రెడ్డి ఏమన్నాడు? అంటూ ఆ రిపోర్టర్ తిరిగి ప్రశ్నించగా, విజయమ్మ మళ్లీ అదే సమాధానం చెప్పారు. కాగా, తాజా పరిణామాలపై షర్మిల తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు. తనను షర్మిల వద్దకు పోనివ్వడం లేదు కాబట్టి నిరాహార దీక్షకు దిగానని తెలిపారు.

This post was last modified on November 30, 2022 10:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐశ్వర్యకు దక్కిన భాగ్యం…వద్దన్న వాళ్లది దురదృష్టం !

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…

10 minutes ago

కల్కి పార్ట్ 2 : 2026 లోనే రిలీజ్!

గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అతి…

21 minutes ago

పాత సినిమా… దుమ్ము దులుపుతోంది

ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013…

44 minutes ago

అమ‌రావ‌తి రైతుల‌కు చంద్ర‌బాబు భారీ కానుక‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సీఎం చంద్ర‌బాబు పండ‌గ పూట భారీ కానుక అందించారు. గ‌త ఏడాదిన్న‌ర‌గా నిలిచి పోయిన…

1 hour ago

సుప్రీం లోనూ కేటీఆర్ కు బిగ్ షాక్!

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…

2 hours ago

ఆ సినిమాను డిస్కౌంట్లో అయినా చూస్తారా?

క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…

2 hours ago