Political News

ఏపీలో ఎప్పుడైనా ఎన్నిక‌లు.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చు.. అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌చుగా కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే… దీనిపై వైసీపీ నాయ‌కులు అబ్బే ఇప్పుడేం లేవు.. అంటూ కామెంట్లు చేస్తున్న విష‌యం కూడా త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అయితే, వైసీపీ అధినేత జ‌గ‌న్ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. చేస్తున్న ప‌నులు వంటివి గ‌మ‌నిస్తే మాత్రం రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది.

తాజాగా దీనికి బ‌లాన్ని చేకూరుస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుడు, డాక్ట‌ర్‌, మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, దీనికి టైం కూడా రెడీ అవుతోంద ని తెలిపారు. అంతేకాదు.. పార్టీలో నాయ‌కులు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎవ‌రూ కూడా అల‌స‌త్వంతో ఉండొద్ద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ యాక్టివ్‌గా ఉండాల‌ని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన క్యాంపు కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో మంత్రి మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, అంద‌రూ దానికి సిద్ధంగా ఉండాల‌ని, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలే పార్టీని ముందుకు న‌డిపిస్తున్నాయ‌ని మంత్రి సీదిరి పేర్కొన్నారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నామ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌కు ఆయ‌న తెలిపారు.

కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు, మీడియా ఏం చేయలేరని, ప‌త్రిక‌ల‌ను చ‌దివి మైండ్ పోగొట్టుకోవ‌ద్ద‌ని, ప్ర‌తిప‌క్షాల మాట‌లు విని మ‌న‌సు ఖ‌రాబు చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న హితోప‌దేశం చేశారు. అయితే, మంత్రి సీదిరి చేసిన ఈ ముంద‌స్తు వ్యాఖ్యలను మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వారించారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌స్తాయ‌నేది సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని ఆయ‌న ఎప్పుడు అనుకుంటే అప్పుడే జ‌రుగుతాయ‌ని చెప్పారు.

This post was last modified on November 29, 2022 6:27 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

17 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago