ఇటీవల ఐటీ దాడులతో తీవ్రస్థాయిలో వార్తల్లోకి వచ్చిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఐటీ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఎంతైనా సంపాయించుకు నేందుకు హక్కుకల్పించడంతోపాటు.. సంపాయించుకున్నవారే టాక్సులు కట్టేలా కూడా సవరిస్తామని చెప్పారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామ న్నారు. తనపై 500 మంది నిపెట్టి ఐటీ దాడులు చేయించారని.. అయినా తాను భయపడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతకాలం తనకు భయం లేదన్నారు. దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ దేశంలో విద్యుత్తు ఉన్నప్పటికీ దానిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించే దమ్ము బీజేపీకి లేదని నిప్పులు చెరిగారు. తాగు సాగునీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు అందించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. ఐటీ రైడ్స్ ఉండవని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాయించుకోవచ్చన్నారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు. మహాత్ముడు. ఓ గొప్ప వ్యక్తి“ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజలకు అంబేద్కర్ తర్వాత సేవ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయం. లాల్కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.
This post was last modified on November 28, 2022 2:39 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…