ప్రధాన ప్రతిపక్షం టీడీపీని చంద్రబాబు నాలుగు అడుగులు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఆయనకు తోడుగా తమ్ముళ్లు కూడా మరింత ముందుకు తీసుకువెళ్లాలని..బాబు పిలుపునిస్తున్నా రు. అయితే, కొందరు మాత్రం చంద్రబాబు లెక్క ప్రకారం అంతో ఇంతో ముందుకు తీసుకువెళ్లే ప్రయ త్నం చేస్తుంటే ఎక్కువ మంది మౌనంగా ఉంటున్నారు. సరే.. మౌనంగా ఉన్నా ఫర్వాలేదు.
కానీ, వీరిలో ఒకరిద్దరు చేస్తున్న పనులు పార్టీని నలభై అడుగుల మేరకు వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆ చివర నుంచి ఈ చివర వరకు కూడా పలువురు నాయ కులు చేస్తున్న యాగీతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యవహారం తాజాగా అధిష్టానం దృష్టికి వచ్చింది.
ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే కాకుండా పార్టీ వర్గాల్లోనూ దుమారం రేపుతున్నాయి. కురబ సామాజిక వర్గానికి చెందిన ఒక సమావేశానికి హాజరైన బీకే.. ఈ సందర్భంగా సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోట్లు ఉంటే తప్ప టీడీపీ టికెట్ రాదని.. ఆశలు పెట్టుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. అప్పటి వరకు పార్టీలోకి రావాలని అనుకున్నవారు కూడా వెనుకడుగు వేశారు.
నిజానికి బీకే పార్టీలో సీనియర్ నాయకుడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు. చంద్రబాబు దగ్గర కూడా మంచి మార్కులే ఉన్నాయి. కానీ, ఆయన పార్టీకి ఉపయోగపడాల్సింది పోయి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు పార్టీని రోడ్డున పడేసిందనే వాదన వినిపిస్తోంది. జేసీ లాంటి వారు ఎలానూ పార్టీ తరఫున పని చేయరు.. కనీసం ఇలాంటి వారైనా పనిచేస్తారని భావించిన చంద్రబాబుకు ఇలాంటి వారు షాకులు ఇస్తున్నారు. దీని వల్ల జరిగే నష్టాన్ని వారు ఊహించ లేక పోతుండడం గమనార్హం.
This post was last modified on November 27, 2022 11:01 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…