Political News

ఢిల్లీకి రేవంత్‌.. తెలంగాణ కాంగ్రెస్‌పై పోస్టు మార్ట‌మ్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచి.. అందరినీ కలుపుకుని.. వచ్చే ఎన్నికల్లోగా పుంజుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని హితబోధ చేస్తోంది. బలమైన పునాదులున్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది.

ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత పరిస్థితులపై మల్లికార్జున్ ఖర్గే దృష్టి సారించారు. తెలంగాణలో 2018 శాసనసభ ఎన్నికల అనంతరం 5 ఉపఎన్నికలు జరిగితే ఒక్కదానిలోనూ విజయం సాధించలేకపోయింది. మూడు స్థానాల్లో ఏకంగా డిపాజిట్‌ కోల్పోయింది. వరుసగా నేతల రాజీనామాలు, బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటున్న భావన నెలకొనడంతో పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అధిష్ఠానం పిలిపించింది.

తొలుత రేవంత్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, రోహిత్ చౌదరి, నదీం జావెద్.. పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్య నేతలకు అందుబాటులోకి రావడంలేదని, పీసీసీ నుంచి సరైన సమాచారం ఉండడం లేదని ఏఐసీసీకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తీరుపై వివరణ అడిగినట్లు సమాచారం. మీరు కలుపుకొని వెళ్లడం లేదా? వారు కలిసి రావడం లేదా? లోపం ఎక్కడుంది?.. సమన్వయం ఎందుకు దెబ్బతింటోందనే దానిపై రేవంత్‌రెడ్డిని ఆరా తీసినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా కొందరు సీనియర్ల తీరుతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్‌రెడ్డి ఏకరవు పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో మీరు కొంత మారాలని, ముఖ్యులకు, నియోజకవర్గ స్థాయి నేతలకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని రేవంత్‌కు అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా.. పెద్ద ఎత్తున నేతలను మోహరించినా కనీసం 30 వేల ఓట్లు రాకపోవడంపై చర్చ కొనసాగినట్లు తెలియవచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ధన ప్రవాహం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మాజీ మంత్రి మినహా.. మిగతా సీనియర్లు మనస్ఫూర్తిగా సహకరించని తీరుపై చర్చకు వచ్చినట్లు సమాచారం.

This post was last modified on November 25, 2022 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

20 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago