ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కేవీపీ రామచంద్రరావు హవా ఇంకా కొనసాగుతోంది వైఎస్ హయాంలో తెగ చక్రం తిప్పిన ఆయన, ప్రస్తుతం పార్టీ పతన దిశలో ఉన్నా కూడా తన పంతం నెగ్గించుకుంటున్నారు. తన వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారు…. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా పల్లంరాజుకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని భావించిన నేపథ్యంలో అనూహ్యంగా గిడుగు రుద్రరాజుకు ఆ పదవి దక్కింది. రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా సహాయ ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన ఆప్త మిత్రుడిగా చెబుతారు. ఈ క్రమంలోనే కేవీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి..
నిజానికి ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన తొలి నియామకం ఇది. 2014…. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క లోక్ సభ సభ్యుడు కూడా లేరు.
విభజన సమయంలో తిరబడిన నేతల్లో చాలా మంది వెళ్లిపోయారు. నిధులు తీసుకొచ్చి పార్టీని నడిపించగలిగిన నేతలు ఇప్పుడు వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలని, ఎవరిని చూసి ఓటెయ్యాలని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. పైగా కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధుల కొరత ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షంలోకి వెళ్లిపోయిన ఆ పార్టీకి ఎవరూ ఫండ్ ఇవ్వడం లేదు..అయినా సరే 2024లో పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో కార్యవర్గాన్ని మార్చినట్లు చెబుతున్నారు.
కొత్తగా ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డి నియమితులయ్యారు. ఐదుగురు వర్కింగ్ ప్రెసిండెట్స్, 18 మంది పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా ప్రత్యర్థి పార్టీలు జోకులు వేస్తున్నాయి. వెళ్లిన వాళ్లు వెళ్లిపోగా కాంగ్రెస్ లో మిగిలిన వారందరికీ పదవులు వచ్చాయని కామెడీ చేస్తున్నారు.
చిన్నాభిన్నమైన పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు, ఈగోలకు తక్కువేమీ ఉండదు. రుద్రరాజు సహనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ కలుపుకుపోవాలి. ఎవరు తమపై అలిగి కూర్చోకుండా చూసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదన్నర మాత్రమే ఉన్న నేపథ్యంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతూ కాంగ్రెస్ కేడర్ ను ఉత్తేజ పరచాలి. మరి గిడుగు రుద్రరాజు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి..
This post was last modified on November 24, 2022 10:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…