Political News

ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ న‌మ్మ‌డం లేదా?

ఏపీ సీఎం జ‌గ‌న్.. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను విశ్వ‌సించ‌డం లేదా? త‌న‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను వైసీపీ ఎమ్మెల్యేలు స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పి కొట్ట‌డం లేద‌ని ఆయ‌న భావిస్తున్నారా? అంటే, తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మ‌యం చాలా ఎక్కువ‌గానే ఉంది. దాదాపు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. అయితే, ఈలోగానే అధికార పార్టీ అధినేత ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టేశారు.

నిజానికి ప్ర‌తిప‌క్షాలు ఇలా దూకుడు ప్ర‌ద‌ర్శించి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించాయంటే అర్థం ఉంది ఉంటుంది. కానీ, ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ కూడా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌గానే ఫ‌క్తు ఎన్నికల ప్ర‌చారం ప్రారంభించ‌డం వెనుక వ్యూహం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ఏడాదిన్న‌ర ముందుగానే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు జ‌గ‌న్ పంపుతున్నారు. గ‌డ‌ప‌గ‌గ‌డ‌ప‌కు వెళ్ల‌క‌పోతే టికెట్ ఇచ్చేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అంతే, త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను తాను న‌మ్మ‌డం లేదు. ప్ర‌జ‌లు కూడా న‌మ్మ‌డం లేద‌ని జ‌గ‌న్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే ముంద‌స్తుగానే ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించారు. ఇక‌, త‌న‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు తానే సొంతంగా కౌంట‌ర్లు ఇస్తున్నారు జ‌గ‌న్‌. ఇటీవ‌ల ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్వ‌హించిన న‌ర‌సాపురంలో స‌భ‌లో చంద్ర‌బాబును , ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మూకుమ్మ‌డిగా విమ‌ర్శించారు. త‌న‌పై చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వాటికి కౌంట‌ర్‌గా వ్యాఖ్య‌లు చేశారు.

ఇక‌, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వ‌హించిన న‌ర‌స‌న్న పేట స‌భ‌లోనూ జ‌గ‌న్ చంద్ర‌బాబు, ప‌వ‌న్ కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘ఇదేం ఖ‌ర్మరా బాబూ’ అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. ఈ ప‌రిణామాలు చూస్తే, త‌నే రంగంలోకి దిగ‌క‌పోతే వ్యూహం చేయిదాటే ప‌రిస్థితిఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టుగానే భావించాలి. మ‌రోవైపు.. జ‌గ‌న్ పాల్గొంటున్న స‌భ‌ల ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు పెట్టుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

న‌ల్ల చున్నీలు వేసుకుని వ‌చ్చిన మ‌హిళ‌ల‌ను అవ‌మానించార‌ని ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయినా.. జ‌గ‌న్ లెక్క‌చేయ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఎవ‌రైనా ఆయ‌న‌ను వ‌చ్చి ప్ర‌శ్నించినా.. న‌ల్ల జెండాలు చూపించినా.. లేక రాయి విసిరినా.. దానికి స‌మాధానం చెప్పుకోవ‌డం అత్యంత ఇబ్బంది. పైగా వైర‌ల్ అవుతుంది. దీనిని ఎదుర్కొన‌డం, ఇప్ప‌టి వ‌ర‌కు సంపాయించుకున్న ప‌ర‌ప‌తిని న‌ష్ట‌పోవ‌డం కంటే బారికేడ్లే బెట‌ర్ అనే తెగువ చూప‌డం గ‌మ‌నార్హం. ఎలా చూసుకున్నా జగ‌న్ ఎన్నిక‌ల వ్యూహానికి బాగానే క‌ష్ట‌పడుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 23, 2022 3:56 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

20 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

39 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago