Political News

ఏపీలో వందేళ్ల త‌ర్వాత‌.. ఈ క్రెడిట్ జ‌గ‌న్‌దే బ్రో!

వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో దాదాపు చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వే ప్రారంభ‌మైంది. వాస్త‌వానికి గ‌త ఏడాది ట్ర‌య‌ల్ ర‌న్‌గా ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముందుకు సాగింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. కొంద‌రికి హ‌క్కు ప‌త్రాలు మంజూరు చేశారు. తొలిదశలో 2 వేల గ్రామాల్లో స‌ర్వే పూర్తి అయింది. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నామ‌ని తెలిపారు. 17 వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నామ‌న్నారు. “రెండేళ్ల కింద‌ట‌ గొప్ప కార్యక్రమాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుంది” అని సీఎం జగన్‌ తెలిపారు.

అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌

వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్‌ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే ఉన్నాయి. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌ ఇస్తామ‌ని తెలిపారు. ప్రతి కమతానికీ ఒక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఇస్తామ‌న్నారు.

1000 కోట్ల‌తో ..

దేశంలో ఎక్కడాలేని విధంగా చేస్తున్న ఈ స‌ర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించారు. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తారు. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. లంచాలకు ఎక్కడా తావులేదని పేర్కొన్నారు.

This post was last modified on November 23, 2022 2:10 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

18 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago