ఏపీ సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా అది వార్తగా మారుతోంది. ఆయన చేసే ప్రసంగాల కన్నా ఈ సభకు చేసే ఏర్పాట్లు, వస్తున్న జనాలు వంటివి జనాల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సభను విజయవంతం చేసేందుకు డ్వాక్రా మహిళలను తరిస్తున్న ఘట్టాలు తెలిసిందే. ఈ క్రమంలొవారు మధ్యలోనే వెళ్లిపోకుండా బారికేడ్లు కూడా అడ్డు పెడుతున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా సీఎం జగన్ ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిపే పర్యటనను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
సీఎం సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు ఇంటింటికీ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేస్తున్నారు. ” సీఎం జగన్ వస్తున్నారు రావాల్సిందే!” అని చెబుతున్నారు. నియోజకవర్గంలోని 60 వేల కుటుంబాలకు వలంటర్లు, పార్టీ వార్డు, గ్రామ కమిటీలతో పంపిణీ చేస్తున్నారు. ముఖ్య నేతలు కూడా కొన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రాలను అందించారు. నియోజకవర్గంలో గడిచిన మూడేళ్లల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా 21న చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఆహ్వాన పత్రాల్లో వివరించారు.
ఇప్పటికే పట్టణం, మండలంలోని చాల గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం సభకు ఆహ్వానాలు అందించడంపై ఆసక్తికరమైన చర్చ నెలకొంది. ఇటు ప్రజలు కూడా దీనిపై భిన్నంగా చర్చించుకోవడం గమనార్హం. వీవర్స్ కాలనీలో జరిగే సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే బాధ్యతను వలంటీర్లు, డ్వాక్రా సంఘాలు, వెలుగు సిబ్బంది, ఇటు పార్టీ నేతలపై పెట్టారు. వార్డులు, గ్రామాల వారీగా టార్గెట్‌లు ఇచ్చారు. వీరందరిని స్కూల్ బస్సుల్లో వేదిక వద్దకు తీసుకొచ్చే బాధ్యతనూ వీరిపైనే ఉంచారు.
మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. సీఎం కాన్వాయ్ లోని బస్సుకు అడ్డువస్తాయన్న కారణంతో ట్యాక్సీస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద 20 అడుగుల ఎత్తున్న ఉన్న భారీ చెట్ల కొమ్మలను నరికివేశారు. ఇప్పటికే మిషన్ హైస్కూల్‌లో డివైడర్‌కు మధ్యలో ఉన్న చాలా చెట్లను తొలగించి కొత్త మొక్కలు వేశారు.
This post was last modified on November 20, 2022 4:59 pm
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…