Political News

‘నా భార్య మంచిది కాదు .. నా భ‌ర్త తాగుబోతు ఓటేయొద్దు’

ఎన్నిక‌లంటే ఎన్నిక‌లే. రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. గ‌తంలో ఎవ‌రో అన్న‌ట్టుగా.. త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అన్న‌ట్టు!! ప్ర‌స్తుతం గుజ‌రాత్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తొలిదశ డిసెంబ‌రు 1న జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో అనేక చిత్ర విచిత్రాలుతెర మీదికి వ‌స్తున్నాయి. వీటిలో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోందేంటంటే.. ఒకే స్తానం నుంచి రెండు పార్టీల త‌ర‌పున పోటీ ప‌డుతున్న భార్యా-భ‌ర్త‌లు! ఔను. నిజ‌మే. మూడు ముళ్ల బంధంతో ఏక‌మైన ఇద్ద‌రు దంప‌తులు రెండు పార్టీల త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు.

ఇది కొత్తేంకాదు.. అంటారా? నిజ‌మే. 2019లో తండ్రి, త‌న‌య‌లు కూడా ఏపీలో రెండు టికెట్ల‌పై పోటీ చేశారు. సో.. ఇక్క‌డ కొంచెం రివ‌ర్స్ అయి.. భార్యాభ‌ర్త‌లు పోటీకి దిగారు. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. భార్య త‌న ప్ర‌చారంలో త‌న భ‌ర్త తాగుబోతు అని అత‌నికి ఓటేయొద్ద‌ని ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, భ‌ర్త‌.. మ‌రో అడుగు ముందుకు వేసి.. త‌న భార్య మంచిది కాద‌ని.. త‌న‌కు కూర కూడా స‌రిగా వండి పెట్ట‌ద‌ని, ఇక‌, మీకేం చేస్తుంద‌ని.. కాబ‌ట్టి ఆమెను ఓడించాల‌ని.. ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. వీరి ప్ర‌చారం వినేందుకు.. ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. క‌ట్ చేస్తే.. వీరిద్ద‌రూ కూడా నైట్ అయ్యేస‌రికి ఒకే ఇంటికి వెళ్లి.. ఒకే కంచంలో అన్నం లాగించేస్తున్నారు!!

ఎవ‌రు.. ఏంటి క‌థ‌!

ప్రభాత్సింగ్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీ నుంచి 1980, 85లో రెండు సార్లు కలోల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1995లో బీజేపీలోకి చేరి.. అదే నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున 1995, 1998, 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత పంచమహల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2009, 2014లో గెలుపొందారు. అయితే తనకు ఇష్టం లేకున్నా పార్టీ అధిష్ఠానం.. 2017లో తన కోడలుకు కలోల్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో ఈ సారి తనకు టికెట్ లభించదన్న కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత గూటికి(కాంగ్రెస్‌) చేరారు ప్రభాత్ సింగ్.

ఇదిలావుంటే, కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాల‌ని భావించిన బీజేపీ వెంట‌నే ప్ర‌భాత్ సింగ్ భార్య రంగేశ్వరిబెన్ రత్వాను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసింది. అంటే.. క‌లోల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ త‌ర‌ఫున భ‌ర్త‌, బీజేపీ త‌ర‌ఫున భార్య పోటీచేస్తున్నార‌న్న‌మాట‌. ఇక‌, ఈ కుటుంబంలోని కోడలు సుమన్బెన్ చౌహాన్ అత్త‌కు మద్దతుగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో భార్యా భ‌ర్త‌ల పోటా పోటీ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రి చివ‌ర‌కు ప్ర‌జ‌లు ఎటు మొగ్గుతారో చూడాలి.

This post was last modified on November 19, 2022 8:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రోజాను నేనేమీ అనలేదు-హైపర్ ఆది

ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ…

2 mins ago

గెలుపు కోసం అసలైన అస్త్రంతో రాహుల్

ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.…

11 mins ago

చేతులు కాలాక కత్తెర పట్టుకున్న ‘కంగువ’

ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘కంగువ’ ఒకటి. కోలీవుడ్ బాహుబలిగా ఈ సినిమాను…

1 hour ago

దేవరకు ఇవ్వలేదు.. పుష్ప 2కి ఇస్తారా?

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్…

2 hours ago

జ‌గ‌న్ ఫార్ములా..: వైసీపీలో ఎనిమిది బంతులు!!

వైసీపీలో కొత్త చ‌ర్చ‌, ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చెప్పిన ఫార్ములా.. 'ఒక బంతిని…

3 hours ago