Political News

నేను క‌ను సైగ చేస్తే.. మీరు చిత్తు చిత్తు: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన చంద్ర‌బాబుకు తొలి రోజు నుంచి వైసీపీ నేత‌ల నుంచి అడ్డగింత‌లు ఎదుర‌వుతున్నాయి. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. హైకోర్టు విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా మూడో రోజు.. చివ‌రి రోజు ప‌ర్య‌ట‌న‌లోనూ వైసీపీ నాయ‌కుల‌, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను అడ్డగించారు. ఏకంగా టీడీపీ ఆఫీస్ వ‌ద్దే హ‌ల్చ‌ల్ చేశారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇక‌, మూడో రోజు ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని మౌర్యా ఇన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కర్నూలు జిల్లా పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదరించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాలు నడుస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులంతా ఓ మాఫియాగా మారారని విమర్శించారు. రాష్ట్రానికి ఎన్ని రాజధానులు కావాలి.. ఒకటి సరిపోదా? అని ప్రశ్నించారు. 50 ఫెడరేషన్లు పెట్టి ఛైర్మన్లు పెట్టారని, వారికి జీతాలు, కుర్చీలు కూడా లేవన్నారు. ఏ2 సాయిరెడ్డి విశాఖపట్నంను దోచేస్తున్నారని, విశాఖలో 50 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, వైసీపీ పేటీఎమ్ బ్యాచ్‌ తనపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

This post was last modified on November 19, 2022 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

16 ఒప్పందాలు.. 50 వేల ఉద్యోగాలు..రూ.1.78 లక్షల కోట్లు

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…

27 minutes ago

జగన్ ఇంటి ఎదుట లోకేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…

2 hours ago

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే…

3 hours ago

‘రేపటి తీర్పు’గా మారనున్న ‘భగవంత్ కేసరి’?

నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…

5 hours ago

ఇదే జ‌రిగితే బాబు హ‌యాం… పెట్టుబ‌డుల సంక్రాంతే..!

ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ పెట్టుబడుల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్…

5 hours ago

పుష్ప-2… బీజీఎం గొడవ ఇంకా సమసిపోలేదా?

పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…

5 hours ago