Political News

ఎంపీని చెప్పుతో కొడతానన్న కవిత

తెలంగాణ‌లో మ‌ళ్లీ రాజ‌కీయ ర‌చ్చ ప్రారంభ‌మైంది. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ చేసిన కామెంట్లు తీ వ్ర వివాదానికి దారితీశాయి. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ పార్టీలో చేరేందు కు స‌మాయ‌త్తం అయ్యారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో క‌విత తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఎక్కువ త‌క్కువ మాట్లాడితే నిజామాబాద్ చౌర‌స్తాలోనే చెప్పుతో కొడ‌తా! అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

మీడియాతో క‌విత‌ మాట్లాడుతూ.. పనితీరు, ప్రవర్తన ఈ రెండూ అర్వింద్‌కు లేవన్నారు. మూడున్నరేళ్లలో కేవలం 60 ప్రశ్నలు మాత్రమే అడిగారన్నారు. తాను కాంగ్రెస్‌లో చేర‌తాన‌న్న అర్వింద్ వ్యాఖ్య‌ల‌పై కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌ లో అర్వింద్ ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసం చేశాడని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. బాండ్‌పేపర్‌ రాసిచ్చిన అర్వింద్‌పై.. ఫిర్యాదు చేస్తామని రైతులు అంటున్నారన్నారు.

“అర్వింద్‌ పై పోటీ చేసిన అభ్యర్థిగా నేనే ఆయన పై ఫిర్యాదు చేస్తా. నేను కాంగ్రెస్‌లోకి వెళ్తానని అసత్యాలు ప్రచారం చేశారు. నా పుట్టుక, బతుకు తెలంగాణ. నేను ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు. అర్వింద్‌ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. నోటికొచ్చినట్లు మాట్లాడితే మెత్తగా తంతాం. నోరు అదుపులో పెట్టుకోకుంటే అర్వింద్‌ను తరిమికొడతాం” అన్నారు.

“కొట్టి చంపుతం బిడ్డ.. రాజకీయం చెయ్‌.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా.. వెంటబడి ఓడిస్తా. పసుపుబోర్డ్‌ తేలేని అర్వింద్‌… రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. బాధతో మాట్లాడుతున్నాను.. ప్రజలు తప్పుగా భావిస్తే క్షమించాలి” అని క‌విత‌ పేర్కొన్నారు.

This post was last modified on November 18, 2022 1:22 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

1 hour ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

3 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

4 hours ago