రాజకీయ నాయకులు జనాల దృష్టిని ఆకర్షించడానికి.. వాళ్లలో ఆలోచన రేకెత్తించడానికి కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంటారు. అనూహ్యమైన చర్యలకు పాల్పడుతుంటారు. భారీ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కొన్నిసార్లు అవి ప్లస్సవుతాయి. కొన్నిసార్లు మైనస్ అవుతుంటాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 2024 ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఆయన ఆలౌట్ వార్‌కు రెడీ అయినట్లే ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఆయన ఏ అస్త్రాన్నీ వదులుకోవాలని అనుకోవట్లేదు.
అసెంబ్లీలో తన కొడుకు నారా లోకేష్‌ను ఉద్దేశించి వైకాపా నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేయగా.. ప్రెస్ మీట్లో వాటి గురించి స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు చంద్రబాబు. ఇది కొంత వరకు ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టిన మాట వాస్తవమే కానీ.. ఒక బలమైన నాయకుడు ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణల్ని దీటుగా ఎదుర్కోవాలే తప్ప ఇలా ఏడవడం కరెక్ట్ కాదని, ఇది ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు తీసుకెళ్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఒక పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ విషయంలోనూ ఇలాంటి స్పందనే కనిపిస్తోంది.
రాష్ట్రం బాగు పడాలంటే తనను మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని, ఈసారి తనకు అవకాశం దక్కకపోతే ఇదే తన చివరి ఎన్నిక అవుతుందని చంద్రబాబు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఆయన కొంచెం ఆవేశానికి, ఉద్వేగానికి గురయ్యారన్నది వాస్తవం. తన వయసు దృష్ట్యా ఎంతో కాలం రాజకీయాల్లో కొనసాగలేనని.. తనకో చివరి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వ్యాఖ్యానించారని అర్థమవుతోంది. ఆయన స్టేట్మెంట్ వాస్తవికంగానే అనిపిస్తున్నా సరే.. ఇది ఆయన బలహీనతను సూచించేదిగా ఉందని, ఇలాంటి డెస్పరేట్ కామెంట్లు రాజకీయాల్లో పనికి రావని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబును రాజకీయంగా వ్యతిరేకించే వారైతే సోషల్ మీడియాలో ఈ కామెంట్ పట్టుకుని ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇంతకుముందు ప్రెస్ మీట్లో ఏడ్చినపుడు కూడా సదరు వీడియోను తర్వాత చాలా సందర్భాల్లో ఆయన్ని ట్రోల్ చేయడానికి ఉపయోగించుకున్నారు ప్రత్యర్థులు. ఇప్పుడు ‘చివరి ఎన్నిక’ కామెంట్‌ను కూడా అలాగే వాడుకుంటారనడంలో సందేహం లేదు. ఐతే జనాల్లో ఈ స్టేట్మెంట్ ఎలాంటి ఆలోచన రేకెత్తిస్తుందన్నది కీలకం. జగన్ గత ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అంటుంటే దానికి వారి నుంచి సానుకూల స్పందనే వచ్చింది. మరి చివరి ఛాన్స్ అంటున్న చంద్రబాబును కూడా కనికరిస్తారేమో చూడాలి.
This post was last modified on November 17, 2022 9:33 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…