తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులకు భాగం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
తెలంగాణలోని చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దృష్టి సారించింది. మూడునెలల తర్వాత తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్, అనుచరుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో వ్యక్తికి సంబంధించి కీలక పత్రాలు బ్యాంకు ధ్రువపత్రాలు సేకరించారు. వాటి పరిశీలన తర్వాత మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు.
వాటి ఆధారంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌ని పిలిచి విచారించారు. వీరు చీకోటితో కలిసి క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నగదు, ఆర్థిక లావాదేవీల విషయంలో హవాలాకు పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసులో మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా మెదక్ సహకార బ్యాంకు ఛైర్మన్‌కు, ఏపీలోని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే(టీడీపీ)కు కూడా నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఈడీ విచారణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. సోమవారం అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అధికారుల ఎదుట విచారణకు రావాల్సి ఉంది.
This post was last modified on November 17, 2022 6:27 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…