జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఫైర్ ఉంటుంది. అంతో ఇంతో.. ఆయన చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్‌లో అయితే.. పవన్ వ్యాఖ్యలకు మరింత డిమాండ్ ఉంది. పవన్ కొన్నిరోజుల కిందట వైసీపీ నేతలను ఉద్దేశించి నా.. కొడ..ల్లారా అంటూ చెప్పు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు.. చాలా రోజుల వరకు కూడా.. వైరల్ అయ్యాయి. ఇక, ఆయన డైలాగులు కూడా అలానే యూత్‌లో ఫాలో అయ్యాయి. అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని ప్రచారం కల్పించింది టీడీపీనేననే వాదన వైసీపీ నేతల నుంచి వినిపించింది.
ఇది కూడా తీసిపారేయలేని వాస్తవమే. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా నెట్ వర్క్ జోరు వేరుగా ఉంటుంది. సో.. పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన కామెంట్లను ఫొటోలను ఐ-టీడీపీనే ఎక్కువగా ప్రచారం చేసిందనడంలో సందేహం కనిపించడం లేదు. ఉభయ కుసలోపరిగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని భావించిన నేపథ్యంలో పవన్‌కు మైలేజీ వచ్చేలా ఐ-టీడీపీ చక్రం తిప్పడం తప్పని పించలేదు.
ఇక, ఇది జరిగిన తర్వాత… పవన్‌పై వైసీపీ నేతలు ఏమన్నా.. వెంటనే టీడీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంపై వైసీపీ కౌంటర్లు ఇవ్వగానే టీడీపీ నేతలు రియాక్ట్ అయి.. వారికి రీ కౌంటర్లు ఇచ్చారు. అంటే.. మొత్తంగా.. పవన్‌కు మేమున్నామనే సంకేతాలను టీడీపీ పంపిం చిందనే చెప్పాలి. కట్ చేస్తే.. ఇటీవల పవన్ చేసిన కామెంట్ల విషయంలో మాత్రం టీడీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాదు.. అనుకున్న విధంగా కూడా స్పందన కూడా రాలేదు.
అదే విజయనగరం జిల్లాలో పర్యటించిన సమయంలో పవన్ ప్రజలను ఉద్దేశించి “ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వైసీపీ నేతల అవినీతిని వెలుగులోకి తెస్తా.. అవినీతి రహిత పాలనను అందిస్తా” అని కామెంట్లు చేశారు. ఇవి యూత్‌లో బాగానే వైరల్ అయ్యాయి. కానీ, ఎటొచ్చీ.. టీడీపీ మాత్రంవీటిని పట్టించుకోక పోవడం.. కనీసం.. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా ఎవరూ పెదవి విప్పలేదు. పరిణామాలను గమనిస్తే.. టీడీపీ ఈ స్లోగన్ విషయంలో అంతర్మథనం చెందుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు పార్టీలు కలిసి.. ముందు వైసీపీపై పోరాటం చేయాలని అనుకున్నామని.. కానీ, ఇంతలోనే ఎన్నికల విషయంలో చేసిన ప్రకటన మాదిరిగా ఒక్క ఛాన్స్ అనేసరికి.. టీడీపీకి ఎక్కడో తేడా కొట్టిందని.. అందుకే సైలెంట్ అయిందని అంటున్నారు. మరి మున్ముందు దీనిపై క్లారిటీ వస్తుందో.. రాదో చూడాలి.
This post was last modified on November 16, 2022 12:16 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…