వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని.. ప్రజల సమస్యలపై పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే పిలుపునిస్తున్నారు. పార్టీ నాయకులను ముందుండి నడిపిస్తున్నారు. దీంతో పార్టీని అంటిపెట్టుకుని ఆది నుంచి ఉన్న నాయకులు అందరూ కదులుతున్నారు. వైసీపీ సర్కారును నిలదీస్తున్నారు. అయితే.. 2017-18 మధ్య వైసీపీ నుంచి వచ్చి టీడీపీలోచేరిన నాయకులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరిలో కొందరికి మంత్రి పదువులు కూడా ఇచ్చారు చంద్రబాబు. అంతేకాదు.. గత 2019 ఎన్నికల్లో వారందరికీ టికెట్లు కూడా ఇచ్చారు. అయితే, వారిలో ఒక్క గొట్టిపాటి రవి (అద్దంకి) తప్ప.. అందరూ ఓడిపోయారు. పోనీ.. పార్టీ తరఫున ఏమైనా వాయిస్ వినిపిస్తున్నారా? అంటే అది కూడా లేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారా ? ప్రజా ఉద్యమాలు చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మరి ఇంతకీ వారు ఏం చేస్తున్నారు? అంటే.. ఎవరికి వారు అంతర్గతంగా మదన పడుతున్నారు.
ఏమాత్రం బయటకు వచ్చినా వారికి ప్రభుత్వం నుంచి షాక్ తప్పదనే సంకేతాలు ఇప్పటికే వెళ్లాయని టీడీపీలో గుసగుస వినిపిస్తోంది. సరే.. ఎప్పటి నుంచో వారు బయటకు రావడం లేదు కదా.. ఇప్పుడు ఎందుకు వీరి గురించిన చర్చ వచ్చిందంటే.. త్వరలోనే పార్టీలో నెంబర్ 2 నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారు. ఈయనకు సహకరించేందుకు జిల్లాల వారీగా కమిటీలువేస్తున్నారు. ఈ కమిటీల్లో జంపింగు నేతలను కూడా ఉంచాలని చంద్రబాబు భావించారు. దీనిపై తాజాగా చర్చ కూడా జరిగింది.
అయితే.. ఒకరిద్దరు నేతలను సంప్రదించగా.. వారు మౌనంగా ఉన్నారు. తమకు ఎలాంటి బాధ్యతలు వద్దని, కావాలంటే.. కొంత ఖర్చులకు సహకరిస్తా మని చెప్పుకొచ్చారు. అంటే.. పరోక్షంగా వారు పాదయాత్రలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారట. భయపడుతూ.. ఎన్నాళ్లు కూర్చుంటారు ? అని నిలదీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, నేతలు మాత్రం ఇప్పుడు తాము బయటకు వస్తే.. ప్రభుత్వం నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుందని, అది టీడీపీనే ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వచ్చితీరాలని హుకుం జారీ చేశారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 15, 2022 12:02 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…