ఏపీ సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్న కీలక పథకం ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ల కాలనీలను ఏర్పాటు చేసి.. ఇళ్లను నిర్మించే చర్యలు చేపట్టారు. అయితే, వేసిన లేఅవుట్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వాటిలో కనీసం మార్కింగ్ కూడా వెయ్యలేదు. దీంతో ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన విజయనగరంలోని గుంకలాంలో పర్యటించి ఇక్కడి దుస్థితిని తెరమీదికి తెచ్చారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా కాలనీల పరిస్థితిని తెలుసుకునేందుకు “జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు” కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరు, కర్నూలు, కోనసీమ, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణ పనులను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తాజాగా పరిశీలించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని..పేదలు ఇళ్లు ఎలా నిర్మిస్తారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని.. జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం గురించి లబ్ధిదారులతో మాట్లాడారు.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జగన్న కాలనీల్లో లబ్ధిదారులతో జనసైనికులు మాట్లాడారు. అప్పు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారని కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు నిర్వహించాలని జనసేన నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై మరింత వేడి పుట్టించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని ఇప్పటికే ఆరోపించిన పవన్.. వాటిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేలా తన కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారు.
ఇదే జరిగితే.. రాష్ట్రంలో జగనన్న ఇళ్ల పథకంపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీనిపై అవసరమైతే.. కోర్టుకు కూడా వెళ్లాలని జనసేన నాయకులు నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందా? వెనుక కు వెళ్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇళ్లను ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్న దరిమిలా అనూహ్యంగా జనసేన దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం వైసీపీకి మింగుడు పడని వ్యవహారమనే చెప్పాలి.
This post was last modified on November 14, 2022 10:26 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…