Political News

అమ‌రావ‌తిపై సుప్రీ తాజా ఆదేశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏక‌కాలంలో విచార‌ణ జ‌రిపాయి. అమ‌రావ‌తి విష‌యంపై కొంద‌రు పిటిష‌న్లు సుప్రీంకోర్టుకు వెళ్ల‌గా.. మ‌రికొంద‌రు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రెండు కోర్టుల్లోనూ.. ఈ కేసులు విచార‌ణ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలని భావిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ క్ర‌మంలోనే విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం తరపున కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. అమరావతిలో అక్రమ భూములపై సీబీఐ చేత విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి తెలియజేశారు. సిట్ ఏర్పాటు చేయడాన్ని పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారన్నారు. సీబీఐ చేతనే విచారణ కోరుతున్న ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సబబు కాదన్నారు.

కాగా… సిట్‌కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(నియమ నిబంధనలు) చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ప్రతివాదుల తరపు న్యాయవాదులు వాదించారు. కాగా, అమరావతిలో అక్రమంగా భూముల కొనుగోలు జరిగిందంటూ ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్)ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించి సిట్ పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.

హైకోర్టులో ఏం జ‌రిగిందంటే..

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు.

రైతుల తరపున హైకోర్టు లో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. మందడం, లింగాయపాలెం గ్రామాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. అదే విధంగా మిగతా 17 గ్రామాల్లో రెండు రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్క‌డ మాస్ట‌ర్ ప్లాన్ మార్పుల‌పై గ్రామ‌స‌భ‌లు నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది.

This post was last modified on November 11, 2022 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముఫాసా ప్లాన్ బ్రహ్మాండంగా పేలింది!

హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…

1 hour ago

ఆర్ఆర్ఆర్ ముచ్చట్లను అంత పెట్టి చూస్తారా?

సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్‌లోనే అలాంటి వీడియోలు…

1 hour ago

పివిఆర్ పుష్ప 2 మధ్య ఏం జరిగింది?

నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…

2 hours ago

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

5 hours ago

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

12 hours ago