విశాఖపట్నంలోని రుషికొండను తవ్వేస్తున్నారని.. అక్కడ జరుగుతున్న తవ్వకాలను అడ్డుకోవాలని.. కోరుతూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం.. విచారణకు స్వీకరించేదిలేదని స్పష్టం చేసింది. దీంతో సీఎం జగన్‌కు ఒకింత రిలీఫ్ దక్కగా.. ఎంపీ రాజు గారికి మాత్రం భారీ షాక్ తగిలినట్టయింది. అయితే, విచారణ విషయంలో హైకోర్టుకు పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
రుషికొండపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రభుత్వ చర్యలపై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్ ఎంపీ రఘురామకు సుప్రీం ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున అక్కడ విచారణ పూర్తయిన తరువాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది.
పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి రుషికొండపై ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందంటూ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదని సుప్రీం కోర్టులో విన్నవించారు. రుషికొండపై నిర్మాణాలకు వెంటనే స్టే విధించాలని కోరారు. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. దీనిపై హైకోర్టునే ఆశ్రయించాలని తేల్చి చెప్పింది.
అయితే, ఇప్పటికే ఈ విషయంపై హైకోర్టు సీరియస్‌గా ఉంది. రుషి కొండ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని.. ఇటీవల జరిపిన విచారణలో తేల్చి చెప్పింది. అంతేకాదు.. అక్కడ ఏం జరుగుతోందో తేల్చేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్కడ అక్రమాలు జరుగుతుంటే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 11, 2022 10:40 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…