ఇప్పటం.. ఆంధ్రప్రదేశ్‌లో అటు ఇటుగా 200 ఇళ్లున్న చిన్న గ్రామం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఈ గ్రామం వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలో జనసేన పార్టీ ప్లీనరీకి తమ పొలాలు ఇచ్చారన్న కారణంతో ఆ పార్టీ మద్దతుదారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో వాటిని కూలగొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో అధికార పార్టీ మద్దతుదారులు, ఆ పార్టీ నేతలు చేసిన వాదనలు పూర్తిగా తేలిపోయాయి. వైసీపీ ప్రో మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా స్థానికులతో మాట్లడించిన వీడియోలు కూడా తుస్సుమనిపించాయి. ఒక వ్యక్తి కూలిన ఇంటి ముందు నిలబడి గ్రామంలో ఏ ఇల్లూ కూలగొట్టలేదని చెప్పడం.. మరో వ్యక్తి మా ప్రహరీ పడగొట్టారు, బ్రహ్మాండంగా ఉంది అనడం చూసి సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు.
ఐతే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి మరింత ఇబ్బందిని కలిగిస్తున్నా అధికార పార్టీ మద్దతుదారులు తగ్గట్లేదు. ఇప్పటంలో ప్రహరీలు కూల్చిన, కొంత మేర దెబ్బ తిన్న ఇళ్ల ముందు విచిత్రమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీల్లో.. ‘‘ప్రభుత్వం మా ఇల్లు ఏమీ కూల్చలేదు. మీ ఎవ్వరి సానుభూతి మాకు అవసరం లేదు. డబ్బులిచ్చి అబద్దాల్ని నిజం చేయాలని ప్రయత్నించవద్దు’’ అని ఆ ఫ్లెక్సీల మీద పేర్కొన్నారు. ఇవి అధికార పార్టీ వాళ్లే ప్రతి ఇంటి ముందు అమరుస్తుండడం విశేషం.
ప్రహరీలు కూల్చేసిన, కొంత మేర దెబ్బ తిన్న, అసలు కూలగొట్టని ఇళ్ల ముందు ఇవి పెట్టడం గమనార్హం. ఇలా గ్రామస్థులు ఎవరైనా తమకు తాముగా మా ఇల్లు కూలగొట్టలేదు అని పెట్టుకుంటారా? అయినా కూల్చిన ఇళ్లకు సంబంధించి ఎన్నో వీడియోలు కనిపిస్తుండగా. .ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి ప్రయోజనం ఏంటి అని ఆలోచించకుండా వీటిని ఇంటింటిముందు అమర్చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఇంకా డ్యామేజ్ పెరుగుతుందనే విషయాన్ని అధికార పార్టీ నాయకులు, మద్దతుదారులు మరిచిపోతుండడం విడ్డూరం.
This post was last modified on November 10, 2022 3:44 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…