ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఇటీవల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇప్పుడు తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి మీడియాలో నిలిచారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇటీవల కాలంలో ప్రజలు మరింత ఏవగించుకుంటున్నారని ఒకవైపు టీడీపీ సహా జనసేన నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఇదే విషయాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో మంత్రి ధర్మాన ఈ వ్యాఖ్యలు చేయడం.. సంచలనంగా మారింది. అయితే.. దీనిపై మీడియా ఇంకెలా ప్రచారం చేస్తుందని అనుకున్నారో ఏమో.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ప్రజలు సంస్కరణలు అర్థం చేసుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని ధర్మాన చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల వలనే.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న మాటలో వాస్తవం లేదన్న ధర్మాన.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిందన్నారు. విశాఖపట్నమే ఏకైక రాజధాని అని.. కర్నూలు, అమరావతిలో ఆ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయన్నా రు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రస్తుతం పరిపాలనలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నమేనన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో రహదారులపై ఏర్పడిన గోతులే ఇప్పుడు పెద్దవై ఉంటాయన్నారు.
సంస్కరణలు చేసేవారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. సంస్కరణలకు ముందే ఫలితాలురావు.. అందుకే ప్రజల ఆమోదం రాదు. సంస్కరణలతో ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా... సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారు
అని ధర్మాన పేర్కొన్నారు. మరి ప్రజలు ఈయనను ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on November 8, 2022 8:59 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…