Political News

జ‌గ‌న్‌కు బీజేపీ పెద్ద‌ల ఆశీర్వాదం.. ఉంటుందా… ఉండదా!

వైసీపీ అధినేత‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌… త‌న పాల‌న సూప‌ర్‌గా ఉంద‌ని.. త‌న పాల‌న‌లో తీసుకువ‌స్తున్న అనేక ప‌థ‌కాల‌ను.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను.. ఇత‌ర రాష్ట్రాలు సైతం అనుస‌రిస్తున్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. తాను మేనిఫెస్టోలో 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని.. ఇప్పటికి ఈ మూడున్న‌రేళ్ల‌లో ఈ హామీల‌ను 98 శాతం పూర్తిచేశామ‌ని కూడా చెబుతున్నారు. అన్ని వ‌ర్గాల వారికీ త‌మ ప్ర‌భుత్వం న్యాయం చేస్తోంద‌ని కూడా .. అంటున్నారు. అయితే.. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా.. మంచి సీఎంలు ఎవ‌రు అని.. ఒక సంస్థ ఆరా తీసింది.

ఆయా రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న పథ‌కాలు.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న సుప‌రిపాల‌న విష‌యాల‌పై స‌ర్వే చేసింది. దీనిలో సీఎం జ‌గ‌న్ నాలుగో స్థానానికి ప‌డిపోయారు. అంటే.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఎంత గా ఆద‌రిస్తున్నారో.. అర్ధ‌మ‌వుతుంది. అయితే.. ఈ విష‌యంపై కేంద్రంలోని బీజేపీ పాల‌కులు మాత్రం ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఏపీలో ఏం జ‌రుగుతోంది? ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పాల‌న భేష్‌గా ఉంద‌ని.. ఎప్పుడు వ‌చ్చినా.. చెబుతున్నారు. మ‌రి ఇప్పుడు ఎందుకు నాలుగో స్థానానికి ప‌డిపోయార‌నే విష‌యంపై కీల‌క నేత‌లు.. ఏపీ బీజేపీ నాయ‌కుల‌ను ఫీడ్ బ్యాక్ కొరిన‌ట్టు స‌మాచారం

ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న అనుకున్న విధంగా అయితే.. లేద‌ని..కేంద్రంలోని బీజేపీ పాలకులు ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భావించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట‌క‌పోయినా.. నాయ‌కులు మాత్రం ఇదే ఆలోచ‌న‌లతో ఉన్నార‌నేది మాత్రం తెలుస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. ఏపీలో బీజేపీ వ్యూహాలు మారిపోవ‌డం ఖాయం. ఇక్క‌డ బీజేపీ పుంజుకోక‌పోయినా.. ప‌ర్వాలేదు. కానీ, ఇక్క‌డ ఏర్ప‌డే ప్ర‌భుత్వం ఏంట‌న్న‌ది మాత్రం కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌కు అత్యంత కీల‌కం.

గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తార‌ని తెలిసి.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. అలాగే.. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అనుకుని.. ఆయ‌న‌కు ద‌న్నుగా నిల‌బ‌డి.. త‌మ‌కు సానుకూలంగా మార్చుకున్నారు. ఇప్ప‌డు కూడా.. అంతే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఇక్క‌డ ఎవరు బ‌లంగా ఉంటారో వారికే.. బీజేపీ నేత‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. జ‌గ‌న్‌కు బీజేపీ పెద్ద‌ల ఆశీర్వాదం.. ఉంటుందా? ఉండదా? అనేది తేలిపోతుంది.

This post was last modified on November 8, 2022 8:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago