Political News

మంత్రులకు చుక్కలు చూపిస్తున్నమునుగోడు పోల్ ఫలితాలు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలుగా పేరును సొంతం చేసుకున్న ఈ ఎన్నికల్లో విజయం తమకు తధ్యమని టీఆర్ఎస్ నేతలు ధీమాగా చెప్పటం తెలిసందే. చెప్పిన మాటలకు.. ఈవీఎంలు ఓపెన్ అయ్యాక వస్తున్న ఫలితాలకు పొంతనే లేని పరిస్థితి. నాలుగైదు రౌండ్లు పోయేసరికి.. విజయగర్వంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి.

ఐదో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అధిక్యతలోకి వచ్చింది. నాలుగో రౌండ్ నాటికి స్వల్ప అధిక్యతలో ఉన్న టీఆర్ఎస్.. ఐదో రౌండ్ ముగిసే సమయానికి 1631 ఓట్లు అధిక్యతలో ఉంది. మొదటి నాలుగు రౌండ్లతో పోలిస్తే.. ఐదో రౌండ్ లోనే టీఆర్ఎస్ కు కాస్తంత అధిక్యత ఎక్కువగా వచ్చినట్లు చెప్పాలి. ఐదోరౌండ్ లో917 ఓట్ల అధిక్యత రావటంతో.. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టిన తర్వాత ఐదో రౌండ్ కు కానీ నాలుగు అంకెల మెజార్టీ వచ్చిన మొదటి సందర్భంగా ఇదేనని చెప్పాలి.

ఈ ఉప పోరు కోసం 16 మంది మంత్రులను.. 84 మంది ఎమ్మెల్యేలను బరిలోకి దించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికను తానెంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానన్న విషయాన్ని తన చేతలతోనూ.. నిర్ణయాలతో తీసుకున్నారని చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డారని చెప్పాలి. అయినప్పటికీ పోరు హోరాహోరీ అన్నట్లు సాగుతున్న తీరు చూస్తే.. సీన్ లోకి ముఖ్యమంత్రి లేకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున బాధ్యతను అప్పగించగా.. వారు నిర్విరామంగా శ్రమించటం తెలిసిందే.

అయినప్పటికీ.. ఇప్పటివరకు వెలువడిన (ఐదో రౌండ్ ముగిసేనాటికి) ఫలితాల్ని చూస్తే.. పలు చోట్లు మంత్రులకు ఎదురుదెబ్బలు తప్పని పరిస్థితి. అన్నింటికి మించి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంతూరు లింగావారి గూడెంలో బీజేపీ అధిక్యంలో నిలవటం గులాబీ వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ.. ఈ ఎన్నికల్లో గెలిచినా.. సొంతూరులో కూసుకుంట్లకు అధిక్యత రాకపోవటాన్ని ఎలా సర్ది చెప్పుకోవాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇక.. పలువురు మంత్రులకు మునుగోడు పీడకలగా మారుతుందని చెబుతున్నారు. ఉదాహరణకు మంత్రి మల్లారెడ్డి విషయాన్నే తీసుకుంటే.. ఆయన్ను ఇంఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పిన ప్రాంతంలో ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి. ప్రతి ఇంటిని ఒకటికి రెండుసార్లు తిరిగి.. వారి అవసరాల్ని గుర్తించి.. వారికి అవసరమైన వాటిని తక్షణమే ఏర్పాటు చేసి.. వారిని మత్తులో ముంచెత్తినప్పటికీ ఫలితం దక్కలేదంటున్నారు. ఆయన బాధ్యత తీసుకున్న ప్రాంతంలో బీజేపీ లీడ్ లోకి రావటం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

ఇదే రీతిలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న దేవులమ్మ నాగారంలోనూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధ్యత తీసుకున్న లింగోజీగూడెంలోనూ బీజేపీ అధిక్యతలో నిలవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తుది ఫలితం సంగతి దేవుడెరుగు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తమ పరిస్థితి ఏమిటి? అన్నది ఆసక్తికర చర్చగా మారింది. చూస్తుంటే.. టీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రముఖులకు మునుగోడు మర్చిపోలేని ఒక భయంకర అనుభవంగా మిగిలే వీలుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on November 7, 2022 9:33 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago