దేశ వ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కొనసాగిస్తోంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుజరిగాయి. ఆయా స్థానాల్లో ఒకటి తెలంగాణలోని మునుగోడును పక్కన పెడితే.. మిగిలిన ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ పుంజుకుని.. ప్రత్యర్థులపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోలా గోక్రానాథ్ నియోజకవర్గం, హర్యానా రాష్ట్రంలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానం, బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ నియోజకవర్గం, ఒడిశాలోని ధాంనగర్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, బీహార్ రాష్ట్రంలోని మోకామా అసెంబ్లీ సెగ్మెంటులో రాష్ట్రీయ జనతాదళ్, మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
రాష్ట్రం నియోజకవర్గం పార్టీ లీడింగ్
బీహార్ గోపాల్ గంజ్ బీజేపీ
హర్యానా ఆదంపూర్ బీజేపీ
యూపీ గోక్రాన్నాథ్ బీజేపీ
ఒడిశా ధాంనగర్ బీజేపీ
బీహార్ మోకామా ఆర్జేడీ
మహారాష్ట్ర అంధేరి ఈస్ట్ శివసేన(ఠాక్రే)
This post was last modified on November 6, 2022 1:37 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…