పశ్నిస్తానంటూ పార్టీ పెట్టి రాజకీయంగా రెండోసారి(తొలిసారి ప్రజారాజ్యం) అరంగేట్రం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. తరచుగా ఏపీ సర్కారుపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కౌలు రైతు సమస్యల నుంచి రహదారుల దుస్థితి వరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీశా రు. భవిష్యత్తులోనూ నిలదీస్తానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల విశాఖ ఘటన విషయంలోనూ తీవ్రస్థాయిలో సర్కారుపై నిప్పులు చెరిగారు.
అయితే, ప్రశ్నించేవాడికే ప్రశ్నలు అన్నట్టుగా తాజాగా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామానికి సంబం ధించి రైతులు పవన్‌కు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూన్‌లో ఇక్కడ నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు కొందరు రైతులు భూములు ఇచ్చారు. అయితే, దీనిని మనసులో పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధించే క్రమంలో ఇక్కడ ఇళ్లను కూల గొడుతోందన్నది పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు.
మరోవైపు.. ఈ పర్యటనకు వచ్చిన పవన్‌ను ఉద్దేశించి ఒకరిద్దరు రైతులు ఆసక్తికర ప్రశ్నలు సంధిస్తున్నా రు. గతంలో సభ పెట్టినప్పుడు.. ఇక్కడి ప్రజలకు రూ.50 లక్షలు ఇస్తానని పవన్ చెప్పారని, దీనికి సంబంధించి ఆయన వాగ్దానం కూడా చేశారని, కానీ, ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదని.. అంటున్నారు. పవన్ ఇప్పటికైనా 50 లక్షలు ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల తొలగింపు ప్రక్రియకు రాజకీయాలకు సంబంధం లేదని కూడా అంటున్నారు.
మార్చిలో ఈ ఇళ్లకు సంబంధించిన మ్యాప్‌ను అదికారులు ఇచ్చారని చెబుతున్నారు. రోడ్డు విస్తరణ అనేది ఎప్పటి నుంచో ఉందని చెబుతున్నారు. పవన్ దీనిని రాజకీయం చేయడం సరికాదని అనే రైతులు కూడా తెరమీదికి వచ్చారు. అయితే, దీనిపై జనసేన నాయకులు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి. మొత్తానికి ఇప్పటి వరకు పవన్‌ను ప్రజలు ఎవరూ ప్రశ్నించలేదు. కానీ, తాజాగా 50 లక్షల విషయంలో ఆయన కు ప్రశ్నలు ఎదురు కావడం గమనార్హం.
This post was last modified on November 5, 2022 10:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…